Wednesday, June 17, 2015

నారాయణుని వైషమ్య అభావం - కీటకముఁ దెచ్చి

7-16-కంద పద్యము
కీకముఁ దెచ్చి భ్రమరము
పావమున బంభ్రమింప భ్రాంతంబై త
త్కీకము భ్రమరరూపముఁ
బాటించి వహించుఁ గాదె యయోగమునన్.
          తుమ్మెద పురుగును తీసుకువచ్చి, ఝంకారం చేస్తూ దానిచుట్టూ తిరుగుతుంది. ఆ పురుగు భయంతో ఆ పురుగునే విడువకుండా చూస్తూ భ్రాంతిపడి, తుమ్మెదగా మారిపోతుంది కదా! అలాగే భయంవల్లగానీ, నయంవల్లగానీ, స్మరణవల్లగానీ, శ్రవణంవల్లగానీ శ్రీహరి సామీప్యం పొందవచ్చు.
७-१६-कंद पद्यमु
कीटकमुँ देच्चि भ्रमरमु
पाटवमुन बंभ्रमिंप भ्रांतंबै त
त्कीटकमु भ्रमररूपमुँ
बाटिंचि वहिंचुँ गादे भययॉगमुनन.
            కీటకమున్ = పురుగును; తెచ్చి = తీసుకొచ్చి; భ్రమరము = తుమ్మెద; పాటవమునన్ = నేర్పుతో; బంభ్రమింపన్ = చుట్టుతిరుగగా; భ్రాంతంబు = భ్రాంతిలోపడినది; = అయ్యి; తత్ = ; కీటకము = పురుగు; భ్రమర = తుమ్మెదయొక్క; రూపమున్ = స్వరూపమును; పాటించి = విడువక; వహించున్ = ధరించును; కాదె = కాదా; భయ = భయముయొక్క; యోగమునన్ = సంబంధముతో.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: