Monday, January 26, 2015

రుక్మిణీకల్యాణం - రాజీవలోచనుడు

103- క.
రాజీవలోచనుఁడు హరి
రాసమూహముల గెల్చి రాజస మొప్పన్
రాజిత యగు తన పురికిని,
రాజాననఁ దెచ్చె బంధురాజి నుతింపన్.
          పద్మాక్షుడు కృష్ణుడు రాజుల నందరిని జయించి రాజస ముట్టిపడేలా విభ్రాజితమైన తన పట్టణానికి ఇందుముఖి రుక్మిణిని చేపట్టి తీసుకొచ్చేడు. బంధువు లంతా పొగిడారు.
103- ka.
raajeevalOchanuM~Du hari
raajasamoohamula gelchi raajasa moppan
raajita yagu tana purikini,
raajaananaM~ dechche baMdhuraaji nutiMpan.
          రాజీవలోచనుడు = పద్మాక్షుడు, కృష్ణుడు; హరి = కృష్ణుడు; రాజ = రాజుల; సమూహములన్ = సమూహములను; గెల్చి = జయించి; రాజసము = గొప్పదనము; ఒప్పన్ = చక్కగాకనబడుతుండ; రాజిత = ప్రకాశించునది; అగు = ఐన; తన = అతని; పురి = పట్టణమున; కిన్ = కు; రాజాననన్ = చంద్రముఖిని, రుక్మిణిని; తెచ్చెన్ = తీసుకొచ్చెను; బంధు = బంధువుల; రాజిత = సమూహము; నుతింపన్ = పొగడుతుండగా.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: