Friday, January 2, 2015

రుక్మిణీకల్యాణం – వచ్చెదరదె

76- వ.
ఇట్లు చూచిన.
77- క.
చ్చెద రదె యదువీరులు
వ్రచ్చెద రరిసేన నెల్ల వైరులు పెలుచన్
నొచ్చెదరును విచ్చెదరును
చ్చెదరును నేడు చూడు లజాతాక్షీ!
          ఇలా చకితహరిణేక్షణ యై ఆమె కృష్ణుని చూడగా కమలనయనా! రుక్మిణీదేవి! ఖంగారు పడకు. యాదవ శూరులు వస్తారు. శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడతారు. పగవారు బాగా నష్టపోతారు, ఓడి చెల్లాచెదరౌతారు, చచ్చిపోతారు చూస్తుండు. ఊరడించసాగాడు.
76- va.
iTlu choochina.
77- ka.
vachcheda rade yaduveerulu
vrachcheda rarisEna nella vairulu peluchan
nochchedarunu vichchedarunu
jachchedarunu nEDu chooDu jalajaataakShee!
          ఇట్లు = ఈ విధముగ; చూచినన్ = చూడగా.
          వచ్చెదరు = ముందుకువస్తున్నారు; అదె = అదిగో; యదు = యాదవ; వీరులు = సైనికులు; వ్రచ్చెదరు = భేదించెదరు; అరి = శత్రు; సేనన్ = సైన్యమును; ఎల్లన్ = అంతటిని; వైరులున్ = శత్రువులను; పెలుచన్ = మిక్కుటముగ; నొచ్చెదరు = దెబ్బతీసెదరు; విచ్చెదరును = చెల్లాచెదురు అగుదురు; చచ్చెదరును = మరణించెదరు; నేడు = ఇవాళ; జలజాతాక్షీ = పద్మాక్షీ, రుక్మిణి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: