Tuesday, September 30, 2014

తేనె సోనలు - గుడులు

గుడులు కట్టించె కంచర్ల గోపరాజు
రాగములు కూర్చె కాకర్ల త్యారాజు
పుణ్యకృతి చెప్పె బమ్మెర పోతరాజు
రాజులీ మువ్వురును భక్తిరాజ్యమునకు
- కరుణశ్రీ
          భక్తులు ఎందరో ఉన్నారు వారందరిలోను రాజులు (గొప్పవారు) అని చెప్పటానికి ముగ్గురే ఉన్నారట. ఒకరు కంచర్ల గోపరాజు. ఆయన గుళ్ళు కట్టించారు భద్రాచలంలో. ఇంకొకరు త్యాగరాజు. ఈయన సంగీతకృతులు కూర్చేరట. మరింకొరు పోతరాజు (బమ్మెర పోతనామాత్యుడు). ఈయన పుణ్య గ్రంధరచన చేసారట.
          అవును అవును కరుణశ్రీ మాట కలకాలం సత్యం, ఎవరు కా దనగలరు.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Monday, September 29, 2014

తేనె సోనలు - అమృతమహాంబురాసి

చ.
మృతమహాంబురాసి తెలుగై మఱి భాగవతమ్మునై త్రిలిం
మునకు డిగ్గెనేమొ యనఁగా హృదయమ్ముల నాడు నేడు నా
ట్యము లొనరించు పోతనమహాకవి ముద్దులపద్యముల్ శతా
బ్దము లయిపోవుగాక మఱవన్ తరమే రసికప్రజాళికిన్.
- దాశరథి
          ఎక్కడో స్వర్గంలో ఉండే అమృత సముద్రం, ఆ మహా సముద్రం తెలుగుభాష అయిపోయి, ఆ పైన తెలుగు భాగవతం అయిపోయి త్రిలింగదేశానికి దిగొచ్చేసిందేమో అన్నట్లుగా హృదయాలలో మెదులుతు ఉన్నాయి. బమ్మెర పోతనామాత్యుల వారి ముద్దులొలికే మధుర పద్యాలు ఆ నాటి నుంచి నేటి దాకా  ఆలా ఆనంద తాండవాలు చేస్తూనే ఉన్నాయి. ఎన్నైనా శతాబ్దాలు గడిచిపోనీ, రసహృదయం తెలిసిన వా రెవిరికైనా వాటిని మరచిపోవుటం సాధ్యం కాదు కదా.
ch.
amRitamahaaMburaasi telugai maRri bhaagavatammunai triliM
gamunaku DiggenEmo yanaM~gaa hRidayammula naaDu nEDu naa
Tyamu lonariMchu pOtanamahaakavi muddulapadyamul shataa
bdamu layipOvugaaka maRravan taramE rasikaprajaaLikin.
          అమృత = అమృతపు; మహా = గొప్ప; అంబురాసి = సముద్రము; తెలుగు = తెలుగు భాషగా; = అయిపోయి; మఱి = ఇంకా; భాగవతమున్ = భాగతముగా; = అయిపోయి; త్రిలింగమున్ = త్రిలింగ దేశాని; కున్ = కి; డిగ్గెనేమొ = దిగివచ్చిందేమో; అనగాన్ = అన్నట్లుగా; హృదయమ్ములన్ = హృదయాలలో; ఆడున్ = మెదులుతాయి; నేడున్ = ఇవాళ్టికి కూడ; నాట్యములు = నృత్యాలు; ఒనరించున్ = చేస్తాయి; పోతన = బమ్మెర పోతన అనే; మహా = గొప్ప; కవి = కవి; ముద్దుల  ముద్దులోలికే; పద్యముల్ = పద్యాలు; శతాబ్దములు = వందలఏళ్ళు; అయిపోవుగాక = గడచినా; మఱవన్ = మర్చిపోవటం; తరమే = సాధ్యమా; రసిక = రసహృదయులైన; ప్రజ = వారల; ఆళికిన్. = సమూహానికి .
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Saturday, September 27, 2014

తెలుగు భాగవత తేనె సోనలు - బాలరసాల సాల

రాజమండ్రి, ఆంద్ర ప్రదేశ్, భారత దేశం.
ఉ.
బారసాల సాల నవల్లవ కోమల కావ్యకన్యకన్
గూలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
          గున్నమామిడి చెట్టుకు పూసిన లేత చివుళ్ళలా కోమలమైనట్టి, కావ్యం అనే కన్యను అమ్ముకుని; అట్టి నీచపు తిండి తినడం కంటే; నిజమైన కవి నాగలి పట్టిన వ్యవసాయదారు డైనప్పటికి తప్పులేదు; అడవీ ప్రాంతాలలో కంద దుంపలు, పుట్టతేనెలుతో దీవించువా రైనప్పటికి తప్పులేదు.
          మధురాతి మధురమైన ఈ పోతనగారి చాటుపద్యం బహుప్రసిద్దమైనది. దీని వెనుక ఒక కథ ఉంది అని చెప్తారు,
          శ్రీనాథ మహాకవి భాగవతాన్ని రాజుకి అంకితమిమ్మని చెప్పటానికి పోతన ఇంటికి పల్లకి లో వెడుతున్నారు. పోతనకొడుకు పొలం దున్నుతున్నారు. శ్రీనాథుడు తన మహాత్మ్యము చూపుదాం అని, ఒక పక్క పల్లకి బొంగు మోస్తున్న బోయీలను తొలగిపొమ్మన్నారు. ఆ బోయీలు లేకున్నా పల్లకి వెళ్తోంది. అది చూసి కొడుకు వింతపడగా, పోతన నాగలి కాడికి గట్టిన వెలపలి ఎద్దును తొలగించమన్నారు. ఆ ఎద్దు లేకుండానే నాగలి పొలమును దున్నుతోంది. శ్రీనాథుడు రెండో పక్క బోయీలను కూడ తొలగిపొమ్మన్నారు. ఏ బోయీలు లేకున్నా పల్లకి గాలిలో తేలుతూ వెళ్తోంది. పోతన లోపలి ఎద్దును సైతం తొలగించమన్నారు. ఏ ఎద్దు లేకుండానే గాలిలో తేలుతూ నాగలి పొలం దున్నుతోంది. ఆ దృశ్యము చూసి శ్రీనాథుడు పల్లకి దిగివచ్చి పోతనతో "హాలికులకు సేమమా?" అని పరిహాస మాడారు. వెంటనే పోతన ఆశువుగా ఇలా కవిత్వ పటుత్వపు పద్యం రూపంలో సమాధాన మిచ్చారు. ఇంతకీ ఆ సత్కవులు ఎవరో మరి?
baalarasaala saala navapallava kOmala kaavyakanyakan
gooLalakichchi yappaDupuM~gooDu bhujiMchuTakaMTe satkavul
haalikulaina nEmi? gahanaaMtara seemalaM~ gaMdamoola kau
ddaalikulaina nEmi nijadaarasutOdarapOShaNaardhamai.
          బాల = గున్న, చిన్న; రసాల = మామిడి; సాల = చెట్టు; నవ = లేత; పల్లవ = చివుళ్ళు వలె; కోమల = కోమలమైన; కావ్య = కావ్యము అనెడి; కన్యకన్ = అమ్మాయిని; కూళలు = క్రూరులు, కుత్సితులు; కున్ = కు; ఇచ్చి = అప్పజెప్పి; = ఆ యొక్క; పడుపు = ప్యభిచారపు; కూడు = తిండి; భుజించుట = తినుట; కంటెన్ = కంటెను; సత్కవుల్ = మంచి కవులు; హాలికులు = వ్యవసాయదారుల; ఐనన్ = అయినను; ఏమి = పరవాలేదు; గహన = అడవుల; అంతర = లోపలి; సీమలన్ = ప్రాంతాలలో; కందమూల = కందదుంపలు; ఔద్దాలికులు = పుట్టతేనెలతో జీవించువారు;ఐనన్ = అయినను; ఏమి = పరవాలేదు; నిజ = తన; దార = భార్య; సుత = పిల్లల; ఉదరపోషణ = జీవిక; అర్థము = నిమిత్తము; = కోసము .

http://telugubhagavatam.org/
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Friday, September 26, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – రాజీవపత్రలోచన

1-528-.
రాజీవపత్రలోచన!
రాజేంద్ర కిరీట ఘటిత త్న మరీచి
బ్రాజితపాదాంభోరుహ!
భూనమందార! నిత్యపుణ్యవిచారా!
            కలువరేకుల వంటి కన్నులు కల వాడా! మహారాజుల కిరీటాలలోని మణుల కాంతులు ప్రతిఫలిస్తున్న పాదపద్మాలు కల వాడా! భూలోకవాసుల పాలిటి కల్పవృక్షమా! మంచివారిని ఎల్లప్పుడు పాలించు వాడా! శ్రీరామా నమస్కారము.
            ఇది ప్రథమ స్కంధాంత స్తోత్రం. కళ్ళు కలువరేకులవలె అందంగా ఉన్నాయి అంటే స్వామి చక్కటి అనుగ్రహాల్ని వర్షిస్తుంటావు అని. లోకంలోని మహారాజులు సైతం నీకు పాదాభివందనాలు చేస్తుంటారు కనుక వారి కిరీటాలలోని మణుల కాంతులు నీ పాదాలపైన నిత్యం పడుతుంటుంది అంటే అంతటి శక్తిసామర్థ్యాలతో మమ్ము పాలిస్తావు అని. భూలోకులకు మందార అంటే మహారాజులు నుండి జనసామాన్యం వరకు అందరిని అజ్ఞానం తొలగించి కల్పవృక్షంలా అనుగ్రహిస్తావు అని. ఎప్పుడు పుణ్యాత్ముల క్షేమ సమాచారాలు చూస్తుంటావు అంటే పుణ్యులమైన మమ్ము పాలిస్తుంటావు అని.
1-528-ka.
raajeevapatralOchana!
raajaeMdra kireeTa ghaTita ratna mareechi
braajitapaadaaMbhOruha!
bhoojanamaMdaara! nityapuNyavichaaraa!
            రాజీవ = తామర; పత్ర = రేకుల వంటి; లోచన = కన్నులు ఉన్న వాడా; రాజ = రాజులలో; ఇంద్ర = శ్రేష్టుల యొక్క మహా రాజుల యొక్క; కిరీట = కిరీటములలో; ఘటిత = పొదగ బడిన; రత్న = రత్నముల యొక్క; మరీచి = కాంతి చేత; బ్రాజిత = ప్రకాశించుచున్న; పాద = పాదములు అను; అంభోరుహ = పద్మములు కల వాడా; భూ = భూమి పై; జన = జనించిన జీవులకు; మందార = కల్పవృక్షమా {మందార - కల్పవృక్షము వలె కోరికలు తీర్చు వాడు / మంద + ఆర = అజ్ఞాన ఛేధకుడు}; నిత్య = నిత్యమును; పుణ్య = పుణ్యాత్ముల గురించి; విచారా = ఆలోచించు వాడా పాలించు వాడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~