Friday, June 28, 2019

కపిల దేవహూతి సంవాదం - 48


( విష్ణు సర్వాంగ స్తోత్రం )

3-934-తే.
దివ్య మరకతరత్న సందీప్త లలిత
కుచములను మౌక్తికావళిరుచులఁ దనరి
యిందిరాదేవి సదనమై యెసక మెసఁగు
వక్షమాత్మను దలపోయవలయుఁ జుమ్ము.
3-935-మ.
నిరతంబున్ భజియించు సజ్జన మనోనేత్రాభిరామైక సు
స్థిర దివ్యప్రభ గల్గు కౌస్తుభరుచిశ్లిష్టంబునై యొప్పు నా
వర యోగీశ్వరవంద్యమానుఁ డగు సర్వస్వామి లక్ష్మీశు కం
ధర మాత్మం గదియించి తద్గుణగణధ్యానంబుసేయం దగున్.

భావము:
దివ్యమైన మరకతమాణిక్య దీప్తులు కలిగి, ముత్యాలహారాల కాంతులతో నిండిన కుచములు కలిగిన లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థ్సలాన్ని ఆత్మలో భావిస్తూ ఉండాలి. యోగీశ్వరులచే నమస్కరాలు అందుకునేవాడూ, అందరికీ ప్రభువూ, లక్ష్మీపతీ అయిన ఆ మహావిష్ణువు యొక్క మెడ; నిత్యం కొలిచే సజ్జనుల మనోనేత్రాలకు ఆనందాలు పంచేటటువంటిదీ, అద్భుతమైన కౌస్తుభమణికాతులలో తేలియాడేదీనూ. అట్టి ఆ విష్ణుమూర్తి మెడను మనసులో నిలుపుకుని దాని గుణాలను ధ్యానం చేయాలి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=50&padyam=935

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: