Sunday, June 2, 2019

కపిల దేవహూతి సంవాదం - 29


3-905-క.
సుర తిర్యఙ్మనుజస్థా
వరరూపము లగుచుఁ గర్మవాసనచేతం
బరపైన మిశ్రయోనులఁ
దిరముగ జనియించి సంసృతిం గైకొని తాన్.
3-906-క.
పూని చరించుచు విషయ
ధ్యానంబునఁజేసి స్వాప్నికార్థాగమ సం
ధానము రీతి నసత్పథ
మానసుఁ డగుచున్ భ్రమించు మతిలోలుండై.

భావము:
సుర నర పశు పక్షి వృక్షాది నానావిధ యోనులందు జన్మించి కర్మవాసనలను విస్తరింపజేసికొని సంసార బంధాలలో చిక్కుపడి చరిస్తూ, విషయసుఖాలను స్మరిస్తూ, కలలో కనిపించే ఐశ్వర్యాల వంటి సుఖాలలో మునిగి తేలుతూ ఉంటాడు. అతని మనస్సు చెడుమార్గాలలో ప్రవర్తిసుంది. అతడు చంచలబుద్ధితో భ్రమిస్తూ ఉంటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=49&padyam=906

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: