Tuesday, June 11, 2019

కపిల దేవహూతి సంవాదం - 34

3-912-వ.
జీవుండు పరమాత్మానుషక్తుండై భూతాది తత్త్వంబులు లీనంబులై ప్రకృతి యందు వాసనామాత్రంబు గలిగి యకార్యకరణంబులై యున్న సుషుప్తి సమయంబునం దాను నిస్తంద్రుం డగుచు నితరంబుచేతఁ గప్పబడనివాఁ డై పరమాత్మానుభవంబు సేయుచుండును" అని చెప్పిన విని; దేవహూతి యిట్లనియె.

భావము:
జీవుడు సుషుప్తిలో భగవంతునితో ప్రగాఢమైన సంబంధం కలిగి ఉంటాడు. వానియందలి పంచభూతాలు మొదలైన తత్త్వాలు ప్రకృతిలో విలీనాలై సంస్కార మాత్రంగా ఉంటూ, తమ పనులను చేయలేని స్థితిలో ఉంటాయి. ఆ సమయంలో సాధకుని ఆత్మ తానుమాత్రం మేల్కొని ఉండి ఎటువంటి అవరోధం లేనిదై పరమాత్మను భావన చేస్తూ ఉంటుంది” అని చెప్పగా విని దేవహూతి కపిలునితో ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=49&padyam=912

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: