Saturday, June 22, 2019

కపిల దేవహూతి సంవాదం - 44


( విష్ణు సర్వాంగ స్తోత్రం )

3-927-మ.
విమలంబై పరిశుద్దమై తగు మనోవిజ్ఞాన తత్త్వప్రబో
ధమతిన్ నిల్పి తదీయమూర్తి విభవధ్యానంబు గావించి చి
త్తము సర్వాంగ విమర్శనక్రియలకుం దార్కొల్పి ప్రత్యంగమున్
సుమహాధ్యానము సేయఁగావలయుఁబో శుద్ధాంతరంగంబునన్.
3-928-వ.
అది యెట్టి దనిన.

భావము:
పరిశుభ్రము, పరిశుద్ధము అయిన మనస్సుతో, విజ్ఞాన తత్త్వ ప్రబోధకమైన సంకల్పంతో ఆ దివ్యమూర్తి రూపవైభవాన్ని ధ్యానించి అన్ని అవయవాలను విడమరచి చూచేటట్లు చిత్తాన్ని తదాయత్తం చేసి ఆ పరాత్పరుని ఒక్కొక్క శరీర భాగాన్నే పరిశుద్ధమైన అంతరంగంలో అనుసంధానం చేసికొని ధ్యానించాలి. అది ఎటువంటిదంటే...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=50&padyam=927

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: