3-911-సీ.
"విను మాత్మవేత్తకు విష్ణుస్వరూపంబు;
నెఱుఁగంగఁ బడునది యెట్లటన్న
గగనస్థుఁ డగు దినకరు కిరణచ్ఛాయ;
జలముల గృహకుడ్యజాలకముల
వలన దోఁచిన ప్రతిఫలితంబుచేత నూ;
హింపగఁ బడిన యయ్యినుని పగిది
నర్థి మనోబుద్ధ్యహంకరణత్రయ;
నాడీప్రకాశమునను నెఱుంగ
3-911.1-తే.
వచ్చు నాత్మస్వరూపంబు వలఁతిగాఁగ
జిత్తమునఁ దోచు నంచితశ్రీఁ దనర్చి
యమ్మహామూర్తి సర్వభూతాంతరాత్ముఁ
డగుచు నాత్మజ్ఞులకుఁ గాననగును మఱియు.
భావము:
“అమ్మా! విను. ఆత్మస్వరూపం తెలిసినవానికి పరమాత్మ స్వరూపం తెలుస్తుంది. ఎలాగంటే ఆకాశంలోని సూర్యుని కిరణాలు నీళ్ళలోనూ, ఇంటిగోడలలోని కిటికీసందులలోను ప్రసరించటం వల్ల సూర్యుడున్నట్లు మనం తెలుసుకుంటాము. మనస్సు బుద్ధి అహంకారం అనే ఈ మూడింటిలో ప్రసారమయ్యే ప్రకాశం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని పరిపూర్ణంగా గుర్తించవచ్చు. చరాచర ప్రపంచంలో అంతర్యామిగా ఉండే ఆ మహామూర్తి ఆత్మవేత్తలైన మహాత్ముల అంతరంగాలలో అఖండ శోభావైభవంతో దర్శనమిస్తాడు. ఇంకా...
http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=49&padyam=911
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment