Friday, June 28, 2019

కపిల దేవహూతి సంవాదం - 47


( విష్ణు సర్వాంగ స్తోత్రం )

3-932-క.
పరిలంబిత మృదుపీతాం
బర కాంచీగుణ నినాదభరితం బగున
ప్పురుషోత్తముని నితంబముఁ
దరుణీ! భజియింపవలయు దద్దయుఁ బ్రీతిన్
3-933-క.
విను భువనాధారత్వం
బునఁదగి విధిజననహేతుభూతంబగున
వ్వనజాతముచేఁగడుమిం
చిన హరినాభీసరస్సుఁజింతింపఁదగున్

భావము:
అమ్మా! ఒయ్యారంగా అంచులు వ్రేలాడుతూ ఉండే మెత్తని పట్టుపీతాంబరం కట్టుకొని మొలనూలు మువ్వల సవ్వడి నివ్వటిల్లే పురుషోత్తముని కటిప్రదేశాన్ని భక్తితో భజించాలి. ఇంకా విను. అఖిల లోకాలకు ఆధారభూతమై, బ్రహ్మపుట్టుకకు హేతుభూతమైన పద్మంతో విరాజిల్లే సరోవరం వంటి విష్ణుమూర్తి నాభీమండలాన్ని సంస్మరించాలి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=50&padyam=933

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: