( విష్ణు సర్వాంగ స్తోత్రం )
3-930-చ.
కమలజు మాతయై సురనికాయ సమంచిత సేవ్యమానయై
కమలదళాభనేత్రములు గల్గి హృదీశ్వర భక్తి నొప్పు న
క్కమల నిజాంకపీఠమునఁ గైకొని యొత్తు పరేశుజాను యు
గ్మము హృదయారవిందమున మక్కువఁ జేర్చి భజింపగా దగున్.
3-931-ఉ.
చారు విహంగవల్లభు భుజంబులమీఁద విరాజమానసు
శ్రీరుచినుల్లసిల్లి యతసీకుసుమద్యుతిఁ జాల నొప్పు పం
కేరుహనాభు నూరువుల కిల్బిషభక్తి భజించి మానసాం
భోరుహ మందు నిల్పఁదగుఁబో మునికోటికి నంగనామణీ!
భావము:
బ్రహ్మకు తల్లియై, దేవతలందరికీ ఆరాధ్యురాలై, కమల దళాలవంటి కన్నులుగల లక్ష్మీదేవి తన హృదయేశ్వరుడైన శ్రీహరి మోకాళ్ళను ఎంతో భక్తితో ఒడిలో చేర్చుకొని ఒత్తుతూ ఉన్న మనోహర దృశ్యాన్ని మనస్సులో మననం చేసుకోవాలి. సొగసైన గరుత్మంతుని భుజాలమీద కాంతి సంపదలతో పెంపొందుతూ, విరిసిన దిరిసెనపువ్వు వన్నెలతో కన్నులవిందు చేసే పద్మనాభుని అందమైన ఊరుయుగ్మాన్ని అచంచలమైన భక్తితో భావిస్తూ మునులైనవారు తమ మనఃకమలాలలో నిల్పుకోవాలి
http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=50&padyam=931
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment