Saturday, June 22, 2019

కపిల దేవహూతి సంవాదం - 43


( విష్ణు సర్వాంగ స్తోత్రం )

3-925-వ.
వెండియు.
3-926-క.
అనుపమగుణ సంపూర్ణుని
ననఘుని సుస్థితుని గతుని నాసీను శయా
నుని భక్తహృద్గుహాశయ
నుని సర్వేశ్వరు ననంతు నుతసచ్చరితున్.

భావము:
ఇంకా సాటిలేని మేటి సుగుణాలతో నిండియున్న వానిని, పాపాలను చెండాడే వానిని, స్థిరమైన వానిని, నడచివస్తున్న వానిని, వచ్చి కూర్చున్న వానిని, సుఖంగా పరుండిన వానిని, హృదయాంతరాలలో నివసించిన వానిని, సర్వేశ్వరుని, శాశ్వతమైన వానిని, సంస్తుతింపదగిన సచ్చరిత్ర కలవానిని (ధ్యానించాలి)

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=50&padyam=926

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: