nee vaaramu
9-618-క.
నీవారము ప్రజ లేమును
నీవారము పూజగొనుము నిలువుము నీవున్
నీవారును మా యింటను
నీవారాన్నంబుగొనుఁడు నేఁడు నరేంద్రా!
9-618-ka.
neevaaramu
prajalaemunu
neevaaramu
pooja gonumu niluvumu neevun
neevaarunu
maa yiMTanu
neevaaraannaMbugonu@MDu
nae@MDu naraeMdraa!
ఓ రాజా! పౌరులు, మా ఆశ్రమ వాసులం
అందరం నీ వాళ్ళమే నయ్యా! ఇవాళ్టికి ఇక్కడ ఆగి మా పూజలు అందుకో. మా యింట్లో నివ్వరి
అన్నంతో ఆతిథ్యాన్ని స్వీకరించు.
– అని శకుంతల తమ కణ్వాశ్రమానికి వచ్చిన దుష్యంతునితో పలికింది. నీవార అంటు ప్రతి
పాదం మొదట చమత్కారంగా వాడిన విధం పద్యానికి వన్నెతెచ్చింది. ఒకటి కంటె ఎక్కువ అక్షరాలు
అర్థ భేదంతో ఒకటి కంటె ఎక్కువ మారులు ప్రయోగిస్తే అది యమకాలంకారం అంటారు. నాలుగు
పాదాలలో నీవాళ్ళం, ఈరోజు, నీపరిజనులు, చక్కటిభోజనం అనే నాలుగు అర్థ భేద ప్రయోగాలతో
ఇక్కడ యమకం చక్కగా పండింది.
నీ = నీకు చెందిన; వారము = వాళ్ళము; ప్రజలున్ = పౌరులు; ఏమునున్ = మేము కూడ; ఈ = ఈ; వారమున్ = రోజు; పూజన్ = మా పూజలను; కొనుము = అందుకొనుము; నిలువుము = ఆగుము; నీవున్ = నీవు; నీ = నీయొక్క; వారునున్ = పరివారము; మా = మా యొక్క; ఇంటన్ = ఇంటిలో; నీవారి = నివ్వరియైన {నీవారము - విత్తక పండెడు దూసర్లు లోనగు తృణధాన్యము, నివ్వరి}; అన్నంబున్ = అన్నమును; కొనుడు = తీసుకొనండి; నేడు = ఇవాళ; నరేంద్రా = రాజా .
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment