puTTi
8-619-ఆ.
పుట్టి నేర్చుకొనెనొ పుట్టక నేర్చెనో
చిట్టి బుద్ధు లిట్టి పొట్టివడుగు
పొట్ట నున్న వెల్ల బూమెలు నని నవ్వి
యెలమి ధరణి దాన మిచ్చె నపుడు.
బలిచక్రవర్తి వామనుడి మాటలకు నిర్భరమైన మనస్సుతో - ఈ పొట్టి
బ్రహ్మచారి ఈ చిట్టి బుద్దులు పుట్టేకా నేర్చుకున్నాడా?
పుట్టకముందే నేర్చుకున్నాడా? ఇతని పొట్ట
నిండా మాయలే అంటు నవ్వి సంతోషంగా భూదానం యిచ్చాడు.
8-619-aa.
puTTi
naerchukoneno puTTaka naerchenO
chiTTi buddhu
liTTi poTTivaDugu
poTTa nunna
vella boomelu nani navvi
yelami
dharaNi daana michche napuDu.
పుట్టి = పుట్టిన తరవాత; నేర్చుకొనెనొ = నేర్చుకొన్నాడో లేక; పుట్టక = పుట్టుటకు ముందే; నేర్చెనో = నేర్చుకొన్నాడో ; చిట్టి = లీలా, ముద్దుల {చిట్టి - చిట్ట కలవి, ఆశ్చర్యకర}; బుద్దులు = బుద్దులు; ఇట్టి = ఇటువంటి; పొట్టి = పొట్టివా డైన; వడుగు = బ్రహ్మచారి; పొట్టన్ = కడుపు నిండా; ఉన్నవి = ఉన్నట్టివి; ఎల్ల = అన్ని; బూమెలున్ = మాయలు, వంచనలు;
అని = అని; నవ్వి = నవ్వి; ఎలమిన్ = సంతోషముతో; ధరణిదానమున్ = భూదానమును; ఇచ్చెన్ = ఇచ్చెను; అపుడు = అప్పుడు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment