lae dani
7-439-క.
లే దని యెవ్వరి నడుగను
రా దని చింతింపఁ బరులు రప్పించినచోఁ
గా దని యెద్దియు మానను
ఖేదము మోదమును లేక క్రీడింతు మదిన్.
7-439-ka.
lae dani
yevvari naDuganu
raa dani
chiMtiMpa@M barulu rappiMchinachO@M
gaa dani
yeddiyu maananu
khaedamu
mOdamunu laeka kreeDiMtu madin.
నాకు ఏ వస్తు వైనా లేదు అని మరొకరిని
అడగను. ఏ దైనా సరే నాకు దొరక లేదు అని బాధపడను. ఎవరు పిలుపించినా తప్పించుకొని
పోను, కర్మారబ్ద మైన దేని నైన వలదు అనను. చిత్తంలో దుఃఖం గాని, సుఖం గాని లేక
ఆనందిస్తు ఉంటాను. –
ప్రహ్లాద అజగర సంవాద ఘట్టంలో అజగరవ్రత ధారి యైన ముని ప్రహ్లాదునికి తన గురించి
చెప్తున్న సందర్భంలో దీ పద్యం. అజగర వ్రత నియమాలు. అప్రయత్నం, అయాచితం, అవాఛితం, అనింద్యం,
అక్రోధనం మొదలైన లక్షణాలతో అజగరంలా ఉండటం. అజగరం అంటే కొండచిలువ. అది ఆహారం కోసం ఎటూ
వెళ్ళదు. ఒకచోట కదలకుండా ఉంటుంది. ఎప్పుడు దొరికితే అప్పుడే దొరికిన ఆహారం చిన్న
పెద్ద అని, మంచి చెడు అని లేకుండ రుచి పచుల పట్టింపు లేక మింగుతుంది. కొన్ని నెలలు
దొరకకపోయినా అలా నిరాహారంగానే ఉంటుంది. అయినా పెద్ద దేహంతో మిల మిల మెరుస్తు
ఉంటుంది.
లేదు = ఏ వస్తువు నాకు లేదు; అని = అని; ఎవ్వరిన్ = ఎవరిని; అడుగను = యాచించను; రాదు = దొరక లేదు; అని = అని; చింతింపన్ = బాధపడను; పరులు = ఇతరులు; రప్పించినచో = పిలిపిస్తే; కాదు = రాను వీలులేదు; అని = అని; ఎద్దియున్ = కర్మానురూపమైన ఏ
పనిని; మానను = తిరస్కరించను; ఖేదము = దుఃఖము; మోదమునున్ = సంతోషములు; లేక = లేకుండగ; క్రీడింతున్ = విహరించెదను; మదిన్ = చిత్తములో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment