Monday, November 11, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 114



taaTaMkaa

8-102-శా.
తాటంకాచలనంబుతో; భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో;
శాటీముక్త కుచంబుతో; నదృఢచంత్కాంచితో; శీర్ణలా
లాటాలేపముతో; మనోహర కరాగ్నోత్తరీయంబుతోఁ;
గోటీందుప్రభతో; నురోజభర సంకోచద్విలగ్నంబుతోన్.
          కరిని కాపాడాలని ఆత్రంతో వెళ్తున్న కాంతుని వెంట పరుగెడుతున్న లక్ష్మీదేవి – చెవిపోగులు ఊగుతున్నాయి; భుజాల మీద కొప్పముడి చిందులేస్తోంది; స్తనాలపై నించి పైట తొలగిపోయింది; తళతళలాడే వడ్డాణం వదు లైపోయింది; పైటకొంగు భర్త చేతిలో పట్టుబడే ఉంది; ఆమె కోటి చంద్రుల కాంతితో మెరిసిపోతోంది; స్తనభారంతో నడుం నకనక లాడుతోంది.
8-102-Saa.
taaTaMkaachalanaMbutO; bhujanaTaddhammilla baMdhaMbutO;
SaaTeemukta kuchaMbutO; nadRDhachaMchatkaaMchitO; SeerNalaa
laaTaalaepamutO; manOharakaraalagnOttareeyaMbutO@M;
gOTeeMduprabhatO; nurOjabhara saMkOchadvilagnaMbutOn.
          తాటంకా = కర్ణాభరణముల యొక్క; చలనంబు = కదలికల; తోన్ = తోటి; భుజ = భుజములపై; నటత్ = నాట్యమాడుతున్న; ధమ్మిల్లబంధంబు = జుట్టుముడి; తోన్ = తోటి; శాటీ = పమిటనుండి; ముక్త = విడివడిన; కుచంబు = స్తనముల; తోన్ = తోటి; అదృఢ = బిగుతు తగ్గి; చంచత్ = చలించుచున్న; కాంచీ = ఒడ్డాణము; తోన్ = తోటి; శీర్ణ = చెదిరిన; లాలాట = నుదిటి యందలి; లేపము = పూత; తోన్ = తోటి; మనోహర = భర్త {మనోహరుడు - మనస్ (మనసును) హరుడు (దొంగిలించిన వాడు), భర్త}; కరా = చేతియందు; లగ్న = చిక్కుకున్న; ఉత్తరీయంబు = పమిట; తోన్ = తోటి; కోటి = కోటి మంది; ఇందు = చంద్రుల; ప్రభ = కాంతి; తోన్ = తోటి; ఉరోజ = స్తనముల యొక్క; భర = బరువువలన; సంకోచత్ = చిక్కిపోయిన; విలగ్నంబు = నడుము; తోన్ = తోటి;
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: