Saturday, November 23, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 121



nutacharitulaara

3-840-క.
నుచరితులార మీరలు
కృకృత్యులు విష్ణుపూజఁ గేవల భక్తిన్
తి నిష్కపటులరై చే
సితిరి త దర్చన ఫలంబు సేకుఱె మీకున్.
          ధన్యచరితులైన దంపతులు మీరు కృతార్థులు. ఏకాగ్ర మైన భక్తితో, నిష్కపట మైన మనస్సుతో విష్ణుమూర్తిని సేవించారు. మీ పూజలకు తగిన ఫలితం దక్కింది. – అని కర్దమ మహర్షి దేవహూతులతో, విష్ణువు కపిలునిగా వారి గర్భ మందు పుట్టిన సందర్భంలో, బ్రహ్మదేవుడు పలికాడు.
3-840-ka.
nutacharitulaara meeralu
kRtakRtyulu vishNupooja@M gaevala bhaktin
mati nishkapaTula rai chae
sitiri ta darchana phalaMbu saeku~re meekun.
          నుత = స్తుతింపబడిన; చరితులార = నడవడిక కల వారలార; మీరలున్ = మీరు; కృతకృత్యులు = సార్థక జన్మలు; విష్ణు = హరి యొక్క; పూజన్ = పూజలను; కేవల = ఏకాగ్ర మైన; భక్తిన్ = అర్చించుటలు; మతిన్ = మనసులలో; నిష్కపటులు = కపటము లేనివారు; = అయ్యి; చేసితిరి = చేసారు; తత్ = ; అర్చన = పూజల; ఫలంబున్ = ఫలితము; చేకఱెన్ = సమకూరినది; మీకున్ = మీకు;
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: