Sreeraajita
9-1-క.
శ్రీరాజిత! మునిపూజిత!
వారిధి గర్వాతిరేక వారణ బాణా!
సూరిత్రాణ! మహోజ్జ్వల
సారయశస్సాంద్ర! రామచంద్ర నరేంద్రా!
లక్ష్మిగలిగి ప్రకాశించే వాడా! మునులు పూజించు
వాడా! సముద్రుడి
గర్వం సర్వం పోగొట్టిన బాణం గల వాడా! పండితులను కాపాడే వాడా! దట్టమైన
గొప్ప కీర్తి గల వాడా! శ్రీరామచంద్ర ప్రభూ! అవధరించు.
9-1-ka.
Sreeraajita!
munipoojita!
vaaridhi
garvaatiraeka vaaraNa baaNaa!
sooritraaNa!
mahOjjvala
saarayaSassaaMdra!
raamachaMdra naraeMdraa!
శ్రీరాజిత = రామా {శ్రీరాజితుడు - శ్రీ (లక్ష్మీదేవి)చేత రాజితుడు (ప్రకాశించెడి వాడు),
రాముడు}; మునిపూజిత = రామా {ముని పూజితుడు -
మునులచే పూజింపబడు వాడు, రాముడు}; వారిధి గర్వాతిరేక వారణ బాణా = రామా {వారిధి గర్వాతిరేక వారణ బాణుడు - వారిధి (సముద్రుని) గర్వాతిరేక (గర్వాతిశయమును)
వారణ (వారించిన) బాణుడు (బాణము గల వాడు), రాముడు}; సూరిత్రాణ = రామా {సూరిత్రాణుడు -
సూరి (పండితులను) త్రాణుడు (కాపాడెడి వాడు), రాముడు}; మహోజ్జ్వల సార యశస్సాంద్ర = రామా {మహోజ్జ్వల సార యశస్సాంద్రుడు - మహా (గొప్ప) ఉజ్జ్వల (ప్రకాశవంత మైన) సార (చేవ గలిగిన)
యశస్ (కీర్తి) సాంద్రుడు (దట్టముగా గల వాడు), రాముడు}; రామచంద్ర నరేంద్రా = రామా {రామచంద్ర నరేంద్రుడు – రాము డనెడి చంద్రునివంటి వాడైన నరేంద్రుడు (రాజు),
రాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment