Thursday, November 7, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 110

raamalatODanu


10.1-1089-క.
రాలతోడను రాసము
రామానుజుఁ డాడఁ జూచి రాగిల్లి మనో
రాములమీఁద వియచ్చర
రాలు మూర్చిల్లి పడిరి రామవినోదా!
          పరీక్షిన్మహారాజ! బ్రహ్మము నందు క్రీడించువాడ! గోవిందుడు గోపవనితలతో రాసలీల సలుపు తుండగా చూసి రంజిల్లిన వారై ఖేచరభామలు పారవశ్యంతో తూలి సోలి తమతమ ప్రాణవల్లభుల మీద వాలిపోయారు.
10.1-1089-ka.
raamalatODanu raasamu
raamaanuju@M DaaDa@M joochi raagilli manO
raamulamee@Mda viyachchara
raamalu moorchillipaDiri raamavinOdaa!
          రామల = గోప పడతుల {రామ – రమింపజేయు నామె, స్త్రీ}; తోడను = తోటి; రాసమున్ = రాసక్రీడను; రామానుజుండు = కృష్ణుడు {రామానుజుడు - బలరాముని తోబుట్టువు, కృష్ణుడు}; ఆడన్ = ఆడుతుండగ; చూచి = చూసి; రాగిల్లి = రక్తిని పొంది; మనోరాముల = భర్తల; మీదన్ = పైన; వియచ్చర = దేవతా; రామలు = స్త్రీలు; మూర్చిల్లి = ఆనందముతో చొక్కి; పడిరి = వాలిపోయిరి; రామవినోదా = పరీక్షిన్మహారాజా {రామ వినోదుడు - రామ (పరబ్రహ్మము, ప్రమాణము శ్లో. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని, ఇతి రామపదేనాసౌ పరబ్రహ్మాభియతే.) అందు వినోదించువాడు, పరీక్షిత్తు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: