bhootamulavalana
1-378-క.
భూతములవలన నెప్పుడు
భూతములకు జన్మ మరణ పోషణములు ని
ర్ణీతములు సేయుచుండును
భూతమయుం డీశ్వరుండు భూతశరణ్యా!
ఆశ్రితవత్సలా! అన్నా! ధర్మరాజా! పరమేశ్వరుడు
సర్వభూతంతర్యామి. ఆయన ప్రాణులకు సృష్టి స్థితి సంహారాలు తోటి ప్రాణుల వలననే
కలుగజేస్తు ఉంటాడు. – అర్జునుడు
అన్న ధర్మరాజుకి కృష్ణనిర్యాణము తెలుపుతు ఆప్తునిగా భగవంతునిగా స్మరిస్తున్న
సందర్భంలోది ఈ పద్యం.
1-378-ka.
bhootamulavalana
neppuDu
bhootamulaku
janma maraNa pOshaNamulu ni
rNeetamulu
saeyuchuMDunu
bhootamayuM
DeeSvaruMDu bhootaSaraNyaa!
భూతముల = జీవుల;
వలనన్ = వలన; ఎప్పుడు = ఎప్పుడును; భూతముల = తోటి జీవుల; కున్ = కు; జన్మ = పుట్టుకలు; మరణ = మరణములు; పోషణములు = పోషణములను; నిర్ణీతములు = నిర్ణయించుటలు; చేయుచుండును = చేయుచుండును; భూత = సర్వభూతములలో; మయుండు = నిండి ఉండువాడు; ఈశ్వరుండు = భగవంతుడు; భూతశరణ్యా = రాజా {భూతశరణ్య – ఆశ్రయించిన ప్రజలకు శరణము ఇచ్చువాడు - రాజు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment