Thursday, November 21, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 119


ae nee guNamulu

10.1-1704-సీ.
ఏ నీ గుణములు గర్ణేంద్రియంబులు సోఁక; దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల; కఖిలార్థలాభంబు లుగుచుండు
నే నీ చరణసేవ యే ప్రొద్దు చేసిన; భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ; దడవిన బంధసంతులు వాయు
తే. నట్టి నీ యందు నా చిత్త నవరతము
నచ్చి యున్నది నీ యాన నాన లేదు,
కరుణఁ జూడుము కంసారి! లవిదారి!
శ్రీయుతాకార! మానినీచిత్తచోర!
          శ్రీకృష్ణా! కంసుని సంహరించినవాడా! ప్రశస్తమైన నీ గుణాలు చెవులలో పడితే చాలు సర్వ తాపాలు నశిస్తాయి. మంగళకరమైన నీ స్వరూపం తిలకిస్తే చాలు కళ్ళకు కావలసిన ప్రయోజనా లన్నీ సమకూరుతాయి. కల్యాణ స్వరూపుడా! నిరంతరం నీ పాదసేవ చేసుకుంటుంటే చాలు లోకంలో ఎంతో మహోన్నతి పొందవచ్చు. దుష్టులను దునుమాడే వాడా! సతతం నీ నామం స్మరిస్తుంటే చాలు భవ బంధాలన్నీ పటాపంచ లైపోతాయి. మానవతుల మానసులు హరించేవాడా! అంతటి సర్వేశ్వరుడ వైన నీ మీదే నా హృదయం లగ్నమై ఉంది. నీ మీద ఒట్టు. ఇది చెప్పడానికి సిగ్గుపడను. అట్టి నన్ను కరుణించు ప్రభూ. – మహాభాగవత పురాణంలోని అత్యద్భుత వృత్తాంతం రుక్మిణీ కల్యాణం అందులోను రుక్మిణీ సందేశం ఘట్టం మధురాతి మధురం, మహా మహితాత్మకం. అది రుచికే కాదు. శుభకరాలకి కూడ ప్రసిద్ధమే. అంటే అంద చందాలు, కవితా మాధురి వగైరాలు మాత్రమే కాదు. ఇహపర సౌఖ్యాలకు ఆలవాలమైన కల్యాణ ఘడియలను శీఘ్రమే అందించే మహా మంత్రరాజం. ఆ ఘట్టంలోది ఈ అమృతగుళిక.
          కం అంటే సుఖమును స అంటే సంహరించేది కంస అహంకారం. దానికి శత్రువు తొలగించే ప్రభువు కంసారి. ఖలం అంటే దుర్గుణాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులు. విదారి అంటే విరిచే వాడు. దుర్గుణాలను ఖండించే వాడు ఖలవిదారి. శ్రీ అంటే బ్రహ్మవిద్య. బ్రహ్మవిద్యతో కూడిన మూర్తిమంతుడు శ్రీయుతాకారుడు. మానిని అంటే స్త్రీ మానం లజ్జ కలిగినది జీవి. చిత్త అంటే చిత్త వృత్తులు ఆత్మ జ్ఞానానికి అడ్డం వచ్చేవి. చోరుడు అంటే దొంగ ఉన్నదానిని లేకుండా చేస్తేవాడు. లజ్జ చెందుతున్న జీవుల చిత్తవృత్తులను తొలగించేవాడు మానినీచిత్తచోరుడు.
10.1-1704-see.
ae nee guNamulu garNaeMdriyaMbulu sO@Mka; daehataapaMbulu dee~ripOvu
nae nee Subhaakaara meekshiMpa@M gannula; kakhilaarthalaabhaMbu galuguchuMDu
nae nee charaNasaeva yae proddu chaesina; huvanOnnatatvaMbu@M boMda@M galugu
nae nee lasannaama mae proddu bhaktitO@M; daDavina baMdhasaMtatulu vaayu
tae. naTTi nee yaMdu naa chitta manavaratamu
nachchi yunnadi nee yaana naana laedu,
karuNa@M jooDumu kaMsaari! khalavidaari!
Sreeyutaakaara! maanineechittachOra!
= ఎట్టి; నీ = నీ యొక్క; గుణములున్ = గొప్ప గుణములు {భగవంతుని గుణములు - 1సర్వజ్ఞత్వము 2సర్వేశ్వరత్వము 3సర్వ భోక్తృత్వము 4సర్వ నియంతృత్వము 5సర్వాంతర్యామిత్వము 6సర్వ సృష్టత్వము 7సర్వ పాలకత్వము 8సర్వ సంహారకత్వము మొదలగునవి}; కర్ణేంద్రియంబులు = చెవులను; సోకన్ = తాకినంతనే; దేహ = శారీరక; తాపంబులు = బాధలు, తాపత్రయములు {తాపత్రయము - 1 ఆధ్యాత్మికము 2ఆదిదైవికము 3ఆదిభౌతికము అనెడి మూడు ఇడుములు}; తీఱిపోవున్ = నశించిపోవునో; = ఎట్టి; నీ = నీ యొక్క; శుభ = శోభనకరమైన; ఆకారమున్ = స్వరూపమును; ఈక్షింపన్ = చూచినచో; కన్నుల్ = కళ్ళ; కున్ = కు; అఖిల = సమస్త మైన; అర్థ = ప్రయోజనములు; లాభంబు = లభించుట; కలుగుచుండున్ = పొందుతు ఉండునో; = ఎట్టి; నీ = నీ యొక్క; చరణ = పాదములను; సేవన్ = కొలచుటచే; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడు; చేసినన్ = చేసినచో; భువన = లోకము నందు; ఉన్నతత్వంబు = అధిక్యము; పొందగలుగు = లభించునో; = ఎట్టి; నీ = నీ యొక్క; లసత్ = మంచి; నామమున్ = పేరులను; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడు; భక్తి = భక్తి; తోన్ = తోటి; తడవినన్ = తలచిన ఎడల; బంధ = సంసార బంధముల {సంసార బంధములు – అష్ట బంధములు, 1దయ 2జుగుప్స 3మోహము 4భయము 6సంశయము 7కులము 8శీలము}; సంతతులు = సమూహము లన్ని; వాయున్ = తొలగునో; అట్టి = అటువంటి; నీ = నీ; అందున్ = ఎడల; నా = నా యొక్క; చిత్తము = మనస్సు; అనవరతము = ఎల్లప్పుడు; నచ్చి = ఇష్టపడి; ఉన్నది = ఉన్నది; నీ = నీ మీద; ఆన = ఒట్టు; నాన = సిగ్గుపడుట; లేదు = లేదు; కరుణన్ = దయతో; చూడుము = చూడు; కంసారి = శ్రీకృష్ణా {కంసారి - కంసుని సంహరించిన వాడు, కృష్ణుడు}; ఖలవిదారి = శ్రీకృష్ణా {ఖలవిదారి - దుర్జనులను సంహరించు వాడు, కృష్ణుడు}; శ్రీయుతాకార = శ్రీకృష్ణా {శ్రీయుతాకారుడు సౌందర్య సంపదలతో కూడి యున్న వాడు, కృష్ణుడు}; మానినీ చిత్త చోర = శ్రీకృష్ణా {మానినీ చిత్త చోరుడు - స్త్రీల మనసులను అపహరించు వాడు, కృష్ణుడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: