3-421 baala
3-421-తే.
బాల శీతాంశు రేఖా విభాసమాన
ధవళ దంష్ట్రాగ్రమున నున్న ధరణి యొప్పె
హరికి నిత్యానపాయిని యైన లక్ష్మి
నెఱయఁ బూసిన కస్తూరి నికర మనఁగ.
యజ్ఞవరాహమూర్తికి పాడ్యమి నాటి చల్లటి
కాంతుల చంద్రరేఖలా తళుకులీను తున్న తెల్లని కోరల చివర నిలిచిన భూదేవి, పూసిన
కస్తూరిముద్దలా నుండి ఎప్పుడు ఎడబాయని లక్ష్మీదేవి బహు చక్కగా అమరి ఉన్నారు.
3-421-tae.
baala
SeetaaMSu raekhaa vibhaasamaana
dhavaLa
daMshTraagramuna nunna dharaNi yoppe
hariki
nityaanapaayini yaina lakshmi
ne~raya@M
boosina kastoori nikara mana@Mga.
బాల = లేత, పాడ్యమి నాటి; శీతాంశు = చందమామ {శీతాంశుడు - చల్లటి అంశ కలవాడు, చంద్రుడు};
రేఖా = వంక వలె {బహుళపక్షం తొలినాళ్లలోని చంద్రురేఖ}; విభాసమాన = ప్రకాశిస్తున్న; ధవళ = తెల్లని; దంష్ట్రా = కోరల; అగ్రమునన్ = కొన లందున; ఉన్న = ఉన్నట్టి; ధరణి = భూమి; ఒప్పెన్ = చక్కగా అమరినది; హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; నిత్య = ఎల్లప్పుడూ; అనపాయని = అసలు విడువ కుండునది; ఐన = అయినట్టి; లక్ష్మి = లక్ష్మీదేవి; నెఱయన్ = నిండుగా; పూసిన = పూసినట్టి; కస్తూరి = కస్తూరి అను సుగంధ ద్రవ్యము; నికరము = ముద్ద; అనగన్ = అన్నట్లు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment