Thursday, February 25, 2016

ప్రహ్లాదుని జన్మంబు - డింభక సర్వస్థలముల

7-278-వ.
అయ్యవసరంబున నద్దానవేంద్రుండు.
7-279-క.
"డిం! సర్వస్థలముల
నంభోరుహనేత్రుఁ డుండు నుచు మిగుల సం
రంభంబునఁ బలికెద వీ
స్తంభంబునఁ జూపఁ గలవె క్రిన్ గిక్రిన్.
7-280-క.
స్తంమునఁ జూపవేనిం
గుంభిని నీ శిరముఁ ద్రుంచి కూల్పఁగ రక్షా
రంమున వచ్చి హరి వి
స్రంభంబున నడ్డపడఁగ క్తుం డగునే."
టీకా:
          ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; = ; దానవేంద్రుండు = రాక్షసరాజు.
          డింభక = కుర్రవాడా; సర్వ = ఎల్ల; స్థలములన్ = ప్రదేశములందును; అంభోరుహనేత్రుండు = హరి {అంభోరుహనేత్రుడు - అంభోరుహ (పద్మముల) వంటి నేత్రుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; ఉండున్ = ఉంటాడు; అనుచున్ = అనుచు; మిగులన్ = మిక్కలి; సంరంభంబునన్ = ఆటోపముతో; పలికెదవు = చెప్పెదవు; ఈ = ఈ; స్తంభంబునన్ = స్తంభమునందు; చూపగలవె = చూపించగలవా; చక్రిన్ = విష్ణుని; గిక్రిన్ = గిక్రిని (చక్రికి ఎగతాళిరూపము).
          స్తంభమునన్ = స్తంభమునందు; చూపవేనిన్ = చూపకున్నచో; కుంభినిన్ = నేలపైన; నీ = నీ యొక్క; శిరమున్ = తలను; త్రుంచి = నరకి; కూల్పగన్ = పడవేయుచుండగ; రక్షా = కాపాడెడి; ఆరంభమునన్ = ప్రయత్నములో; వచ్చి = వచ్చి; హరి = విష్ణువు; విస్రంభంబునన్ = నమ్మకముగా; అడ్డపడగన్ = అడ్డుపడుటకు; శక్తుండు = చాలినవాడు; అగునా = కాగలడా.
భావము:
             ఇలా భగవంతుడు సర్వవ్యాపి అని కొడుకు ప్రహ్లాదుడు చెప్పగా, తండ్రి హిరణ్యకశిపుడు ఇలా అంటున్నాడు.
            ఓరి పెంకిపిల్లాడా! పద్మాక్షుడు విష్ణుమూర్తి సర్వవ్యాపి అన్నిట ఉంటాడని ఇంత గట్టిగా చెప్తున్నావు. అయితే మరి ఈ స్తంభంలో చూపించగలవా ఆ చక్రం గిక్రం పట్టుకు తిరిగేవాణ్ణి.
            నువ్వు చెప్పినట్లు ఈ స్తంభంలో చక్రిని చూపకపోతే, ఎలాగూ నీ తల త్రెంచి నేల మీద పడేస్తాను కదా. అప్పుడు నిన్ను కాపాడటానికి విష్ణువు రాగలడా? అడ్డు పడగలడా?”
७-२७८-व.
अय्यवसरंबुन नद्दानवेंद्रुंडु.
७-२७९-क.
"डिंभक! सर्वस्थलमुल
नंभोरुहनेत्रुँ डुंडु ननुचु मिगुल सं
रंभंबुनँ बलिकेद वी
स्तंभंबुनँ जूपँ गलवे चक्रिन् गिक्रिन्.
७-२८०-क.
स्तंभमुनँ जूपवेनिं
गुंभिनि नी शिरमुँ द्रुंचि कूल्पँग रक्षा
रंभमुन वच्चि हरि वि
स्रंभंबुन नड्डपडँग शक्तुं डगुने."
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: