Sunday, February 1, 2015

రుక్మిణీకల్యాణం - అనఘ యాదిలక్ష్మియైన

109- ఆ.
! యాదిలక్ష్మి యైన రుక్మిణితోడఁ
గ్రీ సలుపుచున్న కృష్ణుఁ జూచి
ట్టణంబులోని ప్రజ లుల్లసిల్లిరి
ప్రీతు లగుచు ముక్తభీతు లగుచు.
          పుణ్యాత్ముడైన పరీక్షిన్మహారాజా! ఆదిలక్ష్మి యొక్క అవతారమైన రుక్మిణితో క్రీడిస్తున్న శ్రీకృష్ణమూర్తిని చూసి ద్వారకానగరంలోని పౌరులు భయాలు విడనాడి మిక్కలి సంతోషంతో విలసిల్లారు. అంటు శుకమహర్షులవారు పరమ పావన మైన రుక్మిణీ కల్యాణ ఘట్టం సంపూర్ణం చేసారు.
109- aa.
anagha! yaadilakShmi yaina rukmiNitODaM~
greeDa salupuchunna kRiShNuM~ joochi
paTTaNaMbulOni praja lullasilliri
preetu laguchu muktabheetu laguchu.
          అనఘ = పుణ్యుడా; ఆదిలక్ష్మి = ఆదిలక్ష్మి; ఐన = అయినట్టి; రుక్మిణి = రుక్మిణీదేవి; తోడన్ = తోటి; క్రీడన్ = క్రీడించుట; సలుపుచున్న = చేయుచున్న; కృష్ణున్ = కృష్ణుని; చూచి = చూసి; పట్టణంబు = నగరము; లోని = అందలి; ప్రజలు = జనులు; ఉల్లసిల్లిరి = ఆనందించిరి; ప్రీతులు = సంతోషముకలవారు; అగుచున్ = అగుచు; ముక్త = విడువబడిన; భీతులు = భయము కలవారు; అగుచున్ = అగుచు.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: