Wednesday, February 25, 2015

కృష్ణలీలలు

10.1-253-కంద పద్యము
మిన్నున కూరక నెగయదు
తన్న సమర్థుండు గాఁడు తల్పగతుం డీ
చిన్నికుమారుఁడు తేరే
విన్ననువున నెగసె దీని విధ మెట్టిదియో.
         “ఉత్తినే కారణం లేకుండా బండి ఎగరదు కదా. మరి ఈ చంటి పిల్లాడు కృష్ణుడు అంతటి పనికి చాలినవాడు కాదు. పక్కమీంచి లేవనైన లేవలేడు. మరి బండి ఎలా ఎగిరిపడింది” అనుకుంటు గోపగోపికాజనాలు విచారించసాగారు.
10.1-253-kaMda padyamu
minnuna kooraka negayadu
tanna samarthuMDu gaaM~Du talpagatuM Dee
chinnikumaaruM~Du tErE
vinnanuvuna negase deeni vidha meTTidiyO.
              మిన్నునన్ = పైకి; ఊరకన్ = కారణములేకుండగ; ఎగయదు = ఎగరజాలదు; తన్నన్ = తన్నుటకు; సమర్థుండు = శక్తిగలవాడు; కాడు = కాడు; తల్పగతుడు = పక్కమీంచి లేవలేని వాడు; ఈ = ఈ; చిన్ని = చంటి; కుమారుడు = పిల్లవాడు; తేరు = బండి; ఏ = ఏ; విన్ననువునన్ = విధముగ, యత్నముచే; ఎగసెన్ = ఎగిరినది; దీని = ఇదిజరిగిన; విధము = విధానము; ఎట్టిదియో = ఏమిటో.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: