10.1-144-క.
ఆ శౌరికిఁ దెరువొసఁగెఁ బ్ర
కాశోద్ధత తుంగ భంగ కలిత ధరాశా
కాశ యగు యమున మును సీ
తేశునకుఁ బయోధి త్రోవ యిచ్చిన భంగిన్.
శూరుని
పుత్రుడైన వసుదేవుడు నవజాత శిశువుని రేపల్లెకు తరలిస్తు యమున దగ్గరకు వచ్చాడు.
ఎగిసిపడుతున్న పెద్దపెద్ద అలలతో భూమినుండి ఆకాశందాకా నల్దిక్కులను కమ్ముకుంటు ప్రవహిస్తు ఉంది. ఆ నది పూర్వకాలంలో
శ్రీరామునికి లంకాపురం వెళ్ళటానికి సముద్రుడు త్రోవ యిచ్చినట్లే, ఆ శిశు రూపి
శ్రీకృష్ణ భగవానునికి యమున దారి యిచ్చింది.
ఇక్కడ
దారి ఇవ్వబడినది త్రేతాయుగ మైనా ద్వాపర యుగ మైనా ఆ పరాత్పరుని అవతార మైన వానికే.
దారి యిచ్చింది. కడలి అయినా యమున అయినా నారపూరమే. అంటే సమస్తం ఆ పరబ్రహ్మ స్వరూపమే
అయినా, ఆత్మ పరమాత్మ అనే గమ్యం చేరటానికి దారి యివ్వవలసినది జ్ఞానమే అని.
10.1-144-ka.
aa shaurikiM~ deruvosaM~geM~ bra
kaashOddhata tuMga bhaMga kalita
dharaashaa
kaasha yagu yamuna munu see
tEshunakuM~ bayOdhi trOva yichchina
bhaMgin.
ఆ
= ఆ; శౌరి
= వసుదేవుని {శౌరి - శూరుని మనుమడు, విష్ణువు}; కిన్
= కి; తెరువు
= దారి; ఒసగెన్
= ఇచ్చెను; ప్రకాశ
= బాగుగా కనబడుతు; ఉద్దతన్
= అతిశయించిన; తుంగ
= పొడవైన; భంగ
= అలలు; కలిత
= కలిగిన; ధర = భూమి; ఆశ = దిక్కులు; ఆకాశ
= ఆకాశము కలది; అగు
= ఐన; యమున
= యమునానది; మును
= పూర్వ కాలంలో; సీతేశున్
= శ్రీరాముని {సీతేశుడు - సీతాదేవి యొక్క భర్త, రాముడు}; కున్
= కు; పయోధి
= సముద్రము {పయోధి - పయస్ (నీటి)కి నిధి, కడలి}; త్రోవ
= దారి; ఇచ్చిన
= ఇచ్చిన; భంగిన్
= విధముగా.
: :
చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment