10.1-34-మత్త.
వావిఁ జెల్లెలు గాని పుత్రికవంటి దుత్తమురాలు; సం
భావనీయచరిత్ర; భీరువు; బాల; నూత్నవివాహ సు
శ్రీవిలాసిని; దీన; కంపితచిత్త; నీ కిదె మ్రొక్కెదన్;
కావవే; కరుణామయాత్మక; కంస! మానవవల్లభా!
కంసమహారాజా! దయామయా! ఈమె నీకు
వరసకు చెల్లెలే కాని, కూతురు లాంటిది. ఉత్తమురాలు.
గౌరవించదగిన నడవడిక గలామె. అసలే భయస్తురాలు. అందులో చిన్నవయస్సుపిల్ల.
కొత్తపెళ్ళికూతురు. చక్కని లక్ష్మీకళలతో విలసిల్లుతున్నది. దీనురాలు భయంతో లోలోన
వణికిపోతున్నది. ఇదిగో నేను నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఈమెను రక్షించు.
కంసుడు ఆకాశవాణి పలుకులు విని చెల్లి
దేవకిని చంపబోతుంటే. వసుదేవుడు అతనిని శాంత పరచే సందర్భంలోని దీ పద్యం.
10.1-34-maththa.
Vavin jellelu gani putrika vamti
duttamuralu; sam
Bhavaniya caritra; bhiruvu; bala;
nutnavivaha su
Srivilasini; dina; kampitacitta;
ni kide mrokkedan;
Kavave; karunamayatmaka! Kamsa!
Manava vallabha!
వావిన్ = వరుసకు; చెల్లెలు
= చెల్లెలు; కాని
= కాని; పుత్రిక
= కూతురు; వంటిది
= లాంటిది; ఉత్తమురాలు
= మంచి యామె; సంభావనీయ
= గౌరవింపదగిన; చరిత్ర
= నడవడిక గలామె; భీరువు
= భయస్తురాలు; బాల
= చిన్నపిల్ల; నూత్నవివాహ
= కొత్తపెళ్ళికూతురుగా; సు = మేలైన; శ్రీ
= కాంతి గల; విలాసిని
= విలాసవతి; దీన
= దీనురాలు; కంపిత
= చలించిన; చిత్త
= మనస్సు కలామె; నీ = నీ; కున్
= కు; ఇదె
= ఇదిగో; మ్రొక్కెదన్
= నమస్కరించెదను; కావవే
= కాపాడుము; కరుణామయ
= దయ గల; ఆత్మక
= మనసు కలవాడ; కంస
= కంసుడా; మానవవల్లభా
= రాజా.
: : సర్వేజనాః సుఖినో భవంతు
: :
No comments:
Post a Comment