Saturday, February 14, 2015

శంకర భక్తమానసవశంకర

10.2-315-ఉ.
శంర! భక్తమానస వశంకర! దుష్టమదాసురేంద్ర నా
శంర! పాండునీలరుచి శంకర వర్ణ నిజాంగ! భోగి రా
ట్కంణ! పార్వతీహృదయకైరవ కైరవమిత్ర! యోగిహృ
త్పంజ పంకజాప్త! నిజ తాండవఖేలన! భక్తపాలనా!
          శంకరా! సుఖములు కలుగజేసెడి వాడ! భక్తుల మనసులను వశంచేసుకొనువాడ! దుష్టులు మదోన్మత్తులు నైన రాక్షసులను నశింపజేయు వాడ! శుభకరము లైన రంగులు తెలుపు దేహమున, నీలము కంఠమున ప్రకాశించు వాడ! సర్ప భూషణుడా! పార్వతీ దేవి హృదయ పద్మమునకు చంద్రుని వంటి వాడ! యోగిజనుల హృదయ కమలములకు సూర్యునివంటి వాడ! తాండవ ప్రియుడా! భక్తులను పరిపాలించు వాడా!
బాణాసురుడు పరమశివుని ఇలా స్తుతిస్తున్నాడు. ఆహా! పోతరాజా ! ఏమి అలంకారలు వేసావయ్యా శంకరుడుకు, భక్తవశంకరుడికి, శంకర (పరమేశ్వర), వశంకర (వశం చేసుకొనువాడు), నాశంకర (హరించు వాడు), శంకరవర్ణ శుభకరమైన రంగులు; పార్వతీహృదయకైరవ కైరవమిత్ర (చంద్రుడ); యోగిహృదయపంకజ పంకజాప్త (సూర్యుడ);
10.2-315-u.
SaMkara! bhaktamaanasa vaSaMkara! dushTamadaasuraeMdra naa
SaMkara! paaMDuneelaruchi SaMkara varNa nijaaMga! bhOgi raa
TkaMkaNa! paarvateehRdayakairava kairavamitra! yOgihR
tpaMkaja paMkajaapta! nija taaMDavakhaelana! bhaktapaalanaa!
          శంకర = శివుడు {శంకరుడు - శుభమును చేయువాడు, శివుడు}; భక్తమానస వశంకర = శివుడు {భక్త మానస వశంకరుడు - భక్తుల మనసులను వశపరచు కొనువాడు, శివుడు}; దుష్టమ దాసురేంద్ర నాశంకర = శివుడు {దుష్టమ దాసురేంద్ర నాశంకరుడు దుర్మార్గులు మదము గలవారులు యైన రాక్షసరాజులను నాశనము చేయువాడు, శివుడు}; పాండు నీల రుచి శంకరవర్ణ నిజాంగ = శివుడు {పాండు నీల రుచి శంకరవర్ణ నిజాంగుడు - పాండు (తెలుపు) నీల (నలుపు) రుచి (కాంతులచే) శంకర (శుభము కలుగజేయుచున్న) వర్ణ (రంగులు కల) నిజ (తన) అంగ (దేహము కలవాడు), శివుడు}; భోగి రాట్కంకణ = శివుడు {భోగి రాట్కంకణుడు - భోగిరాట్ (సర్పరాజు, వాసుకి) కంకణముగా కలవాడు, శివుడు}; పార్వతీ హృదయకైరవ కైరవమిత్ర = శివుడు {పార్వతీ హృదయకైరవ కైరవమిత్రుడు - పార్వతి మనస్సు అను కైరవ (తెల్ల కలువకు) కైరవమిత్రుడు (చంద్రుడు వంటి వాడు), శివుడు}; యోగిహృత్పంకజ పంకజాప్త = శివుడు {యోగిహృత్పంకజ పంకజాప్తుడు - యోగుల హృదయములను పంకజ (పద్మముల)కు పంకజాప్తుడు (సూర్యుని వంటి వాడు), శివుడు}; నిజతాండవ ఖేలన = శివుడు {నిజతాండవ ఖేలనుడు - నిజ (స్వకీయమైన) తాండవమను నాట్యమును / లాస్యమును ఖేలన (ఆడు వాడు), శివుడు}; భక్తపాలనా = శివుడు {భక్తపాలనుడు - భక్తులను పాలించువాడు, శివుడు}.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: