Friday, February 6, 2015

4-489 ధర విరులు

4-489-క.
విరులు గందకుండఁగ
సగతిం బూవుఁదేనెఁ విగొను నిందిం
దివిభు కైవడి బుధుఁడగు
పురుషుఁడు సారాంశ మాత్మఁబూని గ్రహించున్.
         పువ్వులు కందకుండా లోపలి తేనెను మృదువుగా తాగే తేనెటీగ మాదిరి సుజ్ఞాని దేనిని నొప్పించకుండా సారాంశాన్ని నేర్పుగా గ్రహిస్తాడు.
         క్రోధంతో కాదు ఉపాయంగా కావలసినవి సాధించాలి అది నైపుణ్యం అంటు భూమిని పితుకుదామని చూస్తున్న పృథు చక్రవర్తికి భూదేవి చెప్తోంది. పోజిటివ్ థింకింగు, మానేజిమెటు పాఠాలను కలిపి పంచదార అద్ది చెప్పటం అనుకుంటా దీనిని.
4-489-ka.
dhara virulu gaMdakuMDa@Mga
sarasagatiM boovu@Mdaene@M javigonu niMdiM
diravibhu kaivaDi budhu@MDagu
purushu@MDu saaraaMSa maatma@Mbooni grahiMchun.
          4-489-క.| ధరన్ = ప్రపంచములో; విరులున్ = పూవులు; కందకుండగ = కందిపోకుండా; సరస = సున్నితమైన; గతిన్ = విధముగ; పూవుదేనెన్ = మకరందమును; చవిగొనున్ = తాగెడి; ఇందిందిరవిభున్ = గండుతుమ్మెద; కైవడిన్ = వలె; బుధుడు = ఙ్ఞాని; అగు = అయిన; పురుషుడు = మానవుడు; సారాంశమున్ = అవసరమైనదానిని; ఆత్మన్ = మనసున; పూని = పూనుకొని; గ్రహించున్ = సంపాదించుకొనును.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

2 comments:

SD said...

పాజిటివ్ థింకిగు అని రాశరు. థింకింగు అని దిద్దాలి కాబోలు.

దీనిని కిరణ్ ప్రభగారు "సానుకూల దృక్పథం" అని దిద్దారు నా వ్యాసాల్లో ఒకసారి. మీకు నచ్చుతుందో లేదో మరి

vsrao5- said...

ఆర్యా నమస్కారం,
మీరు చూపిన శ్రద్ధకు అభిమానంగా చెప్పినందుకు ధన్యవాదాలండి.
అవునండి. సానుకూల దృక్ఫథం అనేదే సరైన పదం. ఆంగ్ల స్పర్శ చూపాలని థింకింగు అందాం అనుకున్నా. అలవాటులో పొరపాటుగా అక్షరదోషం దొర్లింది.