Monday, February 9, 2015

1-460 తోయములు దెమ్ము

1-460-క.
"తోములు దెమ్ము మా కీ
తోము వేఁటాడు వేళ దొల్లి పొడమ దీ
తోము క్రియ జలదాహము
తోమువారలును లేరు దుస్సహ మనఘా!"
          పరీక్షిన్మహారాజు తీవ్ర దాహంతో ముని వాటిక చేరి తపోమగ్ను డైన శమీకుని చూసి నీళ్ళి మ్మని అడుగుతున్నాడు. మహారాజు కదా ఎంత అందంగా అడుగు తున్నాడో చూడండి. (సాహిత్యంలో అందా లద్దడానికి అర్థాలంకారాలు శబ్దాలంకారాలు. వీటిలో ఆడంబరానికి శబ్దాలంకారం ప్రసిద్ధి. రెండు కాని అంతకంటె ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థ బేధం ఉంటే అది యమకం).
          మంచి నీళ్ళియ్యి మహానుభావా! నీకు పుణ్యం ఉంటుంది. వేటాడ లే నంత దాహంతో వచ్చా నిప్పుడు. ఇంత దుస్సహ మైన దాహం ఎప్పుడూ లేదు. మా వాళ్ళా అందబాటులో లేరు. తట్టుకోలేకపోతున్నానయ్యా తొందరగా నీళ్ళు ఇయ్యి.
1-460-ka.
"tOyamulu demmu maa kee
tOyamu vEM~TaaDu vELa dolli poDama dee
tOyamu kriya jaladaahamu
tOyamuvaaralunu lEru dussaha managhaa!"
          తోయములు = నీరు; తెమ్ము = తీసుకొని రమ్ము; మాకు = మాకు; = ; తోయము = తడవు; వేఁటాడు = వేటాడు; వేళ = సమయములో; తొల్లి = ఇంతకు ముందు; పొడమదు = కలుగదు; = ; తోయము = విధము; క్రియ = వలె; జల = నీటి కోసము; దాహము = దాహము; తోయము = తోటి; వారలును = వారును; లేరు = లేరు; దుస్సహము = సహించుటకు కష్టమైనది; అనఘా = పుణ్యాత్ముడా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: