Wednesday, February 4, 2015

10.1-806 ఈ హేమంతము రాక

10.1-806-శా.
హేమంతము రాకఁ జూచి రమణీ హేలా పరీరంభ స
త్సాహాయ్యంబునఁ గాని దీని గెలువన్ క్యంబుగా దంచుఁ దా
రూహాపోహవిధిం ద్రిమూర్తులు సతీ యుక్తాంగులైనారు గా
కోహో! వార లదేమి సంతతవధూయోగంబు రాఁ గందురే?
          హేమంత ఋతువు రావటం చూసి, కామినుల విలాసవంతమైన బిగికౌగిళ్ళ తోడ్పాటుతో కాని దీని చలిని జయించటం వీలుపడ దన్నపోహ ఊహించుకున్నట్లు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు సరస్వతీ, లక్ష్మీ, పార్వతులను ముగ్గురిని తమ తమ దేహాల యందే ధరించారు. ఔనౌను, ఇదే కారణం లేకపోతే ఆ త్రిమూర్తులు స్త్రీమూర్తుల సదా సాంగత్యం కలిగి ఉండరు కదా. - ఋతువర్ణన ప్రబంద లక్షణం. ఈ ప్రబంధానికి నాయకుడు భగవంతుడు. కర్త పోతననామాత్యులు. ఈ చమత్కార ఋతువర్ణన కవితా మాధురి. ఆస్వాదించండి.
10.1-806-Saa.
ee haemaMtamu raaka@M joochi ramaNee haelaa pareeraMbha sa
tsaahaayyaMbuna@M gaani deeni geluvan SakyaMbugaa daMchu@M daa
roohaapOhavidhiM drimoortulu satee yuktaaMgulainaaru gaa
kOhO! vaara ladaemi saMtatavadhooyOgaMbu raa@M gaMdurae?
      = ఈ యొక్క; హేమంతము = చలి కాలము; రాకన్ = వచ్చుటను; చూచి = చూసి; రమణీ = భార్యల యొక్క {రమణి – క్రీడింప దగి నామె, స్త్రీ}; హేలా = విలాస పూరితమైన; పరిరంభ = ఆలింగనముల; సత్ = మంచి; సహాయ్యంబునన్ = తోడ్పాటు వలన; కాని = తప్పించి; దీనిన్ = దీనిని; గెలువన్ = జయింప; శక్యంబు గాదు = వీలు కాదు; అంచున్ = అనుచు; తార్ = వారు; ఉహాపోహల = తర్కించి నిర్ణయించు కొన్న; విధిన్ = విధముగా; త్రిమూర్తులు = బ్రహ్మ విష్ణు మహేశ్వరులు; సతీ = భార్యలతో; యుక్త = కూడిన; అంగులు = దేహములు కలవారు; ఐనారు = అయితిరి; కాకన్ = లేకపోతే; ఓహో = ఔరా; వారలు = వారు; అది = అలా; ఏమి = ఎందుకు; సంతత = ఎడతెగని; వధూ = భార్యతో; యోగంబున్ = కూడి యుండుటను; రాన్ = కలుగుటను; కందురే = పొందుదురా.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: