Monday, November 24, 2014

రుక్మిణీకల్యాణం – లోపలి సౌధంబులోన

31- సీ.
లోపలి సౌధంబులోన వర్తింపఁగాఁ
          దేవచ్చునే నిన్నుఁ దెత్తునేని
గావలివారలఁ ల బంధువులఁ జంపి
          కాని తేరా దని మలనయన!
భావించెదేని యుపాయంబు చెప్పెద
          నాలింపు కులదేవయాత్రఁ జేసి
గరంబు వెలువడి గజాతకును మ్రొక్కఁ
          బెండ్లికి మునుపడఁ బెండ్లికూఁతుఁ
తే.
నెలమి మావారు పంపుదు రేను నట్లు
పురము వెలువడి యేతెంచి భూతనాథు
తికి మ్రొక్కంగ నీవు నా మయమందు
చ్చి గొనిపొమ్ము నన్ను నవార్యచరిత!
          ఓ కమలాల వంటి కన్నులున్న కన్నయ్యా! “నీవు కన్యాంతఃపురంలో ఉంటావు కదా రుక్మిణీ ! నిన్ను ఎలా తీసుకుపోవాలి. అలా తీసుకెళ్ళాలంటే కాపలావాళ్ళను, అప్పు డక్కడ యున్న బంధుజనాలను చంపాల్సివస్తుంది కదా” అని నీవు అనుకుంటే, దీనికి యొక యుపాయం మనవిచేస్తాను. చిత్తగించు. పెళ్ళికి ముందు మా వారు పెళ్ళికూతురును మా యిలవేల్పు మంగళగౌరిని మొక్కడానికి పంపిస్తారు. నేను కూడ అలాగే నగరి వెలువడి మొక్కుచెల్లించడానికి ఊరి వెలుపల యున్న దుర్గగుడికి బయలుదేరి వస్తాను. అడ్డగింపరాని నడవడిక కలవాడా! కృష్ణా! ఆ సమయానికి దారికి అడ్డంగా వచ్చి నన్ను నిరాటంకంగా తీసుకొనిపో!
31- see.
lOpali saudhaMbulOna vartiMpaM~gaaM~
          dEvachchunE ninnuM~ dettunEni
gaavalivaaralaM~ gala baMdhuvulaM~ jaMpi
          kaani tEraa dani kamalanayana!
bhaaviMchedEni yupaayaMbu cheppeda
          naaliMpu kuladEvayaatraM~ jEsi
nagaraMbu veluvaDi nagajaatakunu mrokkaM~
          beMDliki munupaDaM~ beMDlikooM~tuM~
tE.
nelami maavaaru paMpudu rEnu naTlu
puramu veluvaDi yEteMchi bhootanaathu
satiki mrokkaMga neevu naa samayamaMdu
vachchi gonipommu nannu navaaryacharita!
          లోపలి = లోపలికి ఉన్న; సౌధంబు = అంతఃపురము; లోనన్ = అందు; వర్తింపంగా = తిరుగుచుండగా; తేవచ్చునే = తీసుకురాగలమా; నిన్నున్ = నిన్ను; తెత్తునేని = తీసుకొచ్చినను; కావలివారలన్ = కాపలాదారులను; కల = అక్కడున్న; బంధువులన్ = చుట్టములను; చంపి = సంహరించి; కాని = కాని; తేరాదు = తీసుకురాలేము; అని = అని; కమలనయన = పద్మాక్షుడా, కృష్ణా; భావించెదేని = తలచెడి పక్షమున; ఉపాయంబు = సుళువు మార్గమును; చెప్పెదన్ = తెలిపెదను; ఆలింపు = వినుము; కులదేవ = ఇలవేల్పుని కొలుచుట కైన; యాత్ర = ప్రయాణము; చేసి = అయ్యి; నగరంబు = అంతఃపురము; వెలువడి = బయలుదేరి; నగజాత = పార్వతీదేవి; కును = కి; మ్రొక్కన్ = పూజించుటకు; పెండ్లి = వివాహమున; కిన్ = కు; మునుపడన్ = ముందుగా; పెండ్లికూతున్ = పెళ్ళికూతురును; ఎలమి = ప్రీతితో.
           మావారు = మావాళ్ళు; పంపుదురు = పంపించెదరు; ఏనున్ = నేను కూడ; అట్లు = ఆ విధముగనే; పురము = అంతఃపురము; వెలువడి = బయలుదేరి; ఏతెంచి = వచ్చి; భూతనాథుసతి = పార్వతీదేవి {భూతనాథుసతి - భూతనాథు (శివు)ని సతి, పార్వతి}; కిన్ = కి; మ్రొక్కగన్ = పూజించుచుండగా; నీవున్ = నీవు; = ఆ యొక్క; సమయము = సమయము; అందున్ = అందు; వచ్చి = చేరవచ్చి; కొనిపొమ్ము = తీసుకెళ్ళుము; నన్నున్ = నన్ను; అవార్యచరిత = నివారింపరాని వర్తన గలవాడా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: