Sunday, November 2, 2014

రుక్మిణీకల్యాణం – వనజగర్భుపంపున

2- క.       
నజగర్భు పంపున
రైతుఁ డను రాజు దెచ్చి రామున కిచ్చెన్
రేతి యనియెడు కన్యను
భూర! మును వింటిగాదె బుద్ధిం దెలియన్.
    శుకుడు పరీక్షిన్మహారాజా! రైవత మహారాజు కూతురు రేవతి. అతను బ్రహ్మదేవుడు చెప్పగా రేవతిని తీసుకొచ్చి బలరాముడి కిచ్చి పెళ్ళి చేసాడు. ఇంతకు ముందు విన్నావు కదా ఇది.
    రైవతుడు అనే మహారాజు పుత్రికకు తగిన వరుని చెప్పమని బ్రహ్మదేవుడుని అడగటానికి సత్యలోకం వెళ్ళాడు. కొద్ది సమయం తరువాత ఆయన దర్శనం దొరికింది. బ్రహ్మదేవుడు గట్టిగా నవ్వి ఇక్కడి కాలమానం ప్రకారం జరిగిన ఈ కొద్ది సమయంలో, భూలోకంలో ఎన్నో యుగాలు గడిచిపోయాయి. ఇప్పడు బలరామ కృష్ణులు అవతరించారు నీవు వెంటనే వెళ్ళి నీ కూతురును కృష్ణుని అన్నగా అవతరించిన బలరామునకు ఇయ్యి అని చెప్పాడు. ఆయన ఆ ప్రకారం తన కూతురు రేవతిని బలరామునకు ఇచ్చాడు. {బ్రహ్మకి 1నిమిషం = 6211800 మానవ సంవత్సరాలు}
2- ka.      
aa vanajagarbhu paMpuna
raivatuM~ Danu raaju dechchi raamuna kichchen
rEvati yaniyeDu kanyanu
bhoovara! munu viMTigaade buddhiM deliyan.
          ఆ = ఆ ప్రసిద్ధుడైన; వనజగర్భు = బ్రహ్మదేవుని; పంపునన్ = ఆజ్ఞచేత; రైవతుడు = రైవతుడు; అను = అనెడి; రాజున్ = రాజు; తెచ్చి = తీసుకొచ్చి; రామున్ = బలరాముని; కిన్ = కి; ఇచ్చెన్ = భార్యగా ఇచ్చెను; రేవతి = రేవతి; అనియెడి = అనెడి; కన్యను = అవివాహితను; భూవర = రాజా; మును = ఇంతకు ముందు; వింటి = విన్నావు; కాదె = కదా; బుద్ధిన్ = మనసునకు; తెలియన్ = తెలియునట్లుగా.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: