10.2-1003-క.
అప్పుడు సాందీపని మన
చొప్పరయుచు వచ్చి వానసోఁకునను వలిం
దెప్పిఱిలుటఁ గని ఖేదం
బుప్పతిలం బలికె "నకట! యో! వటులారా!
10.2-1004-చ.
కటకట! యిట్లు మా కొఱకుఁగాఁజనుదెంచి మహాటవిన్ సము
త్కటపరిపీడ నొందితిరి; గావున శిష్యులు! మీ ఋణంబు నీఁ
గుట కిది కారణంబు సమకూరెడిఁ బో; యిట మీఁద మీకు వి
స్ఫుట ధనబంధుదారబహుపుత్త్ర విభూతి జయాయురున్నతుల్. "
భావము:
అప్పుడు, మన గురువుగారైన సాందీపని మహర్షి మనలను వెదుక్కుంటూ వచ్చాడు. వానలో తడిసి చలికి గజగజమని వణుకుతున్న మనల్ని చూసి విచారం పొంగిపొరలగా ఇలా అన్నాడు. “అమ్మో! పిల్లల్లారా! మాకోసం అడవికి వచ్చి అయ్యయ్యో మీరు ఎంత ఇబ్బంది పడ్డారు. కనుక, ఓ శిష్యులారా! మీరు మీ గురుఋణం తీర్చుకున్నారు. మీకు ధన దార బహు పుత్ర సంపదలూ దీర్ఘాయురున్నతులూ విజయశ్రీలు చేకూరగలవు.”
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=72&Padyam=1004
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment