3-898-సీ.
కరమొప్పఁగా విరాట్పురుషుండు వెలుఁగొందు;
నా విరాట్పురుషుని యాననంబు
వలనను వాణియు వాణితో వహ్నియు;
నాసంబువలనఁ బ్రాణములఁ గూడి
ఘ్రాణేంద్రియం బయ్యె ఘ్రాణంబువలనను;
వాయువులును బ్రాణవాయువులును
నందు నక్షులు చక్షు వందు సూర్యుండును;
నందభిధ్యానంబు నర్థిఁ జేయఁ
3-898.1-తే.
గర్ణములు జాత మయ్యెఁ దత్కర్ణసమితి
వలన శ్రోత్రేంద్రియంబు దిక్కులును గలిగెఁ
ద్వక్కుచే శ్మశ్రు రోమ వితానకములు
నోషధివ్రాతమును భవ మొందె; మఱియు.
భావము:
ఆ అండంలో విరాట్పురుషుడు వెలుగుతూ ఉంటాడు. అతని ముఖం నుండి వాణి, వాణితోపాటు అగ్ని పుట్టాయి. ముక్కునుండి ప్రాణాలు, ఘ్రాణేంద్రియం పుట్టాయి. ఘ్రాణేంద్రియం నుండి వాయువులు, ప్రాణవాయువులు ఆవిర్భవించాయి. ప్రాణవాయువుల వల్ల కన్నులు, కన్నులవల్ల సూర్యుడు పుట్టారు. వానియందు ధ్యాన మేర్పడగా చెవులు పుట్టాయి. వానివల్ల శ్రోత్రేంద్రియం దిక్కులూ పుట్టాయి. చర్మంనుండి గడ్డం, మీసాలు మొదలగు రోమసమూహమూ, ఓషధులూ జనించాయి. ఇంకా..
http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=48&padyam=898
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment