Saturday, May 4, 2019

కపిల దేవహూతి సంవాదం - 12

3-882-క.
తనరుదు రప్పుణ్యాత్ములు
జనయిత్రి! మదీయ కాలచక్రగ్రసనం
బును నొందక నిత్యం బగు
ననుపమ సుఖవృత్తి నుందు రది యెట్లన్నన్.
3-883-మ.
సముఁడై స్నేహముచే సుతత్వమును విశ్వాసంబుచేతన్ సఖి
త్వముఁ జాలన్ హితవృత్తిచేతను సుహృత్త్వంబున్ సుమంత్రోపదే
శముచేతన్ నిజదేశికుం డనఁగ నిచ్చల్ పూజ్యుఁ డౌ నిష్ఠదై
వమునై వారికిఁ గాలచక్రభయముల్ వారింపుదుం గావునన్."

భావము:
అమ్మా! ఆ పుణ్యాత్ములు నా కాలచక్రానికి మ్రింగుడు పడనివారై నిరుపమానమైన నిత్య సౌఖ్యాలతో అలరారుతుంటారు. అది ఎలాగంటే సర్వసముడనైన నేను స్నేహంవల్ల కుమారుని వలెనూ, విశ్వాసంవల్ల చెలికాని వలెనూ, హితం కూర్చడంవల్ల ఆత్మీయుని వలెనూ, మంత్రం ఉపదేశించడంవల్ల ఆచార్యునివలెనూ ఉంటూ వారికి నిత్యమూ పూజింపదగిన ఇష్టదైవాన్నై, కాలచక్రం వల్ల భయం కలుగకుండా వారిని కాపాడుతూ ఉంటాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=883

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: