Wednesday, May 8, 2019

కపిల దేవహూతి సంవాదం - 15

3-887-క.
గురుభక్తిం జిత్తము మ
త్పరమై విలసిల్లు నంతపర్యంతము స
త్పురుషుల కిహలోకంబునఁ
జిరతర మోక్షోదయంబు సేకుఱుచుండున్."
3-888-క.
అని యిట్లు సన్మునీంద్రుఁడు
జననికి హరిభక్తియోగ సంగతి నెల్లన్
వినిపించుచు వెండియు ని
ట్లనియెన్ సమ్మోదచిత్తుఁ డగుచుఁ గడంకన్.

భావము:
అత్యంత భక్తితో చిత్తాన్ని ఎంతవరకు నాయందే లగ్నంచేసి ఉంచుతారో అంతవరకు ఆ సత్పురుషులకు ఈలోకంలోనే మోక్షం సంప్రాప్తిస్తుంది." అని కపిలాచార్యుడు విష్ణుసంబంధమైన భక్తియోగ స్వరూపాన్ని తల్లికి వినిపించి ఎంతో సంతోషంతో మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=888

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: