Sunday, May 5, 2019

కపిల దేవహూతి సంవాదం - 13

3-884-వ.
అని యిట్లు దెలుపుచు మఱియు నిట్లనియె.
3-885-చ.
"విను మదిగాక యీ భువిఁ దివిం బలుమాఱుఁ జరించు నాత్మ దా
ధన పశు పుత్ర మిత్ర వనితాతతిపైఁ దగులంబు మాని న
న్ననఘుని విశ్వతోముఖు ననన్యగతిన్ భజియించెనేని వా
నిని ఘనమృత్యురూప భవనీరథి నేఁ దరియింపఁ జేయుదున్.

భావము:
అని ఈవిధంగా చెప్తూ మళ్ళీ ఇలా అన్నాడు.
“ఇంకా విను. ఈ భువికీ దివికీ నడుమ పలుసారులు తిరుగుతూ ఉండే ఆత్మ ధనం, పశువులు, పుత్రులు, మిత్రులు, స్త్రీలు మొదలైన తగులాలపై వ్యామోహం విడిచిపెట్టి పాపాలను సంహరించేవాడనూ, ప్రపంచమంతటా వ్యాపించినవాడనూ అయిన నన్ను ఏకాగ్రచిత్రంతో ఆరాధించినట్లైతే ఆ మానవుని మృత్యుమయమైన సంసారసముద్రం నుండి తరింపజేస్తాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=885

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: