Monday, May 20, 2019

కపిల దేవహూతి సంవాదం - 19

3-892-క.
"దివ్యమగు వాసుదేవా
దివ్యూహచతుష్టయంబు త్రిజగము లందున్
సేవ్యం బని చెప్పంబడు
భవ్యగుణా! దాని నెఱుఁగ బలికెద నీకున్.

భావము:
“వాసుదేవం, సంకర్షణం, ప్రద్యుమ్నం, అనిరుద్ధం అనే దివ్యమైన ఈ నాలుగు వ్యూహాలూ ముల్లోకాలలోనూ సేవింపదగినవి. సుగుణవతీ! వాటిని నీకు వివరించి చెబుతాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=892

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :a

No comments: