3-893-సీ.
సత్త్వప్రధానమై స్వచ్ఛమై శాంతమై;
యూర్మిషట్కంబుల నోసరించి
సురుచిర షాడ్గుణ్య పరిపూర్ణమై నిత్య;
మై భక్తజన సేవ్యమై తనర్చి
వలనొప్పుచుండు నవ్వాసుదేవవ్యూహ;
మంత మహత్తత్త్వ మందు నోలి
రూఢిఁ గ్రియాశక్తిరూపంబు గల్గు న;
హంకార ముత్పన్న మయ్యె నదియ
3-893.1-తే.
సరవి వైకారికంబుఁ దైజసముఁ దామ
సంబు నా మూఁడు దెఱఁగుల బరగు నందుఁ
దనరు వైకారికము మనస్సునకు నింద్రి
యములకును గగనముఖ భూతముల కరయ
3-894-వ.
అది దేవతారూపంబుల నుండు దైజసాహంకారంబు బుద్ధి ప్రాణంబులుం గలిగి యుండు తామసాహంకారం బింద్రియ మేళనంబున నర్థమాత్రం బై యుండు; మఱియును.
భావము:
వాసుదేవవ్యూహం ఆకలిదప్పులు, శోకమోహాలు, జరామరణాలు అనే ఆరు ఊర్ములనుండి విడివడినదై ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం అనే షడ్గుణాలతో పరిపూర్ణమై సత్త్వగుణ ప్రధానమై, నిర్మలమై, శాంతమై, నిత్యమై, భక్తజన సంసేవ్యమై అలరారుతూ ఉంటుంది. మహత్తత్త్వం నుండి క్రియాశక్తి రూపమైన అహంకారం పుట్టింది. ఆ అహంకారం వైకారికం, తైజసం, తామసం అని మూడు విధాలుగా విడివడింది. వానిలో వైకారికాహంకారం అనేది మనస్సుకూ, పంచేంద్రియాలకూ, అకాశాది పంచభూతాలకూ ఉత్పత్తి స్థానమై దేవతారూపమై ఉంటుంది. తైజసాహంకారం బుద్ధిరూపాన్నీ, ప్రాణరూపాన్నీ కలిగి ఉంటుంది. తామసాహంకారం ఇంద్రియార్థాలతో సమ్మేళనం పొంది ప్రయోజనమాత్రమై ఉంటుంది. ఇంకా...
http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=893
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment