3-897-సీ.
గురుశక్తియౌ విరాట్పురుషుండు సంభవం;
బయ్యె నయ్యండంబు నర్థిఁ బొదవి
యంబు ముఖావరణంబు లొక్కొకటికి;
దశగుణితంబులై తవిలి యావ
రణములై యుండును గ్రమమున లోకంబు;
నకు మేలుకట్ల పోలికఁ దనర్చి
పంకజోదరుని రూపము విలసించును;
లోలత జలములోఁ దేలుచున్న
3-897.1-తే.
హేమమయ మైన యండంబులో మహాను
భావుఁ డభవుండు హరి దేవదేవుఁ డఖిల
జేత నారాయణుఁడు ప్రవేశించి యపుడు
విష్ణుపద భేదనంబు గావించి యందు.
సప్తతత్వములు
భావము:
ఆ అండంలో మహత్తరమైన శక్తితో విరాట్పురుషుడు విరాజిల్లుతూ ఉంటాడు. ఆ అండాన్ని పొదువుకొని పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తు అనే ఆవరణాలు ఒకదానికంటె ఒకటి పదింతల ప్రమాణం కలిగి ఉంటాయి. లోకాలకు మేల్కట్టు చాందినీలవలె ఒప్పియున్న ఆ పొరలలో నుంచి విష్ణుదేవుని తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. జలంతో తేలుతూ ఉన్న బంగారుమయమైన ఆ అండంలో మహానుభావుడు, అభవుడు, శ్రీహరి, దేవదేవుడు, విశ్వవిజేత అయిన నారాయణుడు ప్రవేశించి గగనమండలాన్ని భేదించి వేస్తాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=47&padyam=897
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment