Monday, May 13, 2019

కపిల దేవహూతి సంవాదం - 17

3-890-క.
"క్రమమునఁ ద్రిగుణము నవ్య
క్తము నిత్యము సదసదాత్మకము మఱియుఁ బ్రధా
నము ననఁగాఁ బ్రకృతివిశే
షము లదియు విశిష్ట మనిరి సద్విదు లెలమిన్.

భావము:
“త్రిగుణాత్మకం, అవ్యక్తం, నిత్యం, సదసదాత్మకం, ప్రధానం అనేవి ప్రకృతి విశేషాలు. ఈ విశేషాలతో కూడి ఉన్నది కనుక ప్రకృతిని విశిష్టం అని ప్రాజ్ఞులు పేర్కొన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=890

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: