Saturday, February 28, 2015

కృష్ణలీలలు

10.1-258-వచనము
అప్పుడా బాలుని రోదనంబు విని యశోద పఱతెంచి.
10.1-259-ఆటవెలది
లసితివి గదన్న! యాకొంటివి గదన్న!
మంచి యన్న! యేడ్పు మాను మన్న!
న్నుఁగుడువు మన్న! సంతసపడు మన్న!
నుచుఁ జన్నుఁగుడిపె ర్భకునకు.
          ఇలా శకటాసుర సంహారం చేసిన లీలా బాలకుడు కృష్ణుని ఏడుపు విని యశోద పరుగెట్టుకొచ్చింది.
          ఓనా కన్న తండ్రీ! ఏడ్చి ఏడ్చి అలసిపోయావా. కన్నా ఆకలేస్తోందా! నువ్వు చాలా మంచివాడివి కదరా కన్నా! ఏడుపు మానెయ్యరా కన్నయ్యా! దా పాలు తాగరా కన్నా! ఇక నవ్వరా నాయనా! మరి అంటు లాలిస్తూ యశోద శిశువుకు పాలు ఇచ్చింది.
10.1-258-vachanamu
appuDaa baaluni rOdanaMbu vini yashOda paRrateMchi.
10.1-259-aaTaveladi
alasitivi gadanna! yaakoMTivi gadanna!
maMchi yanna! yEDpu maanu manna!
channuM~guDuvu manna! saMtasapaDu manna!
yanuchuM~ jannuM~guDipe narbhakunaku.
          అప్పుడు = ఆ సమయమునందు; = ; బాలుని = పిల్లవాని; రోదనంబు = ఏడుపు; విని = విని; యశోద = యశోద; పఱతెంచి = పరుగెట్టుకొచ్చి.
          అలసితివి = అలసిపోయావు; కద = కదా; అన్న = నాయనా; ఆకొంటివి = ఆకలి వేసినది; కద = కదా; అన్న = నాయనా; మంచి = బుద్ధిమంతుడివి; అన్న = నాయనా; ఏడ్పున్ = రోదనమును; మానుము = మానివేయుము; అన్న = నాయనా; చన్ను = చనుబాలు; కుడువుము = తాగుము; అన్న = నాయనా; సంతసపడుము = సంతోషింపుము; అన్న = నాయనా; అనుచున్ = అంటూ; చన్నున్ = చనుబాలు; కుడిపెన్ = తాగించెను; అర్భకున్ = పిల్లవాని; కున్ = కి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

Friday, February 27, 2015

కృష్ణలీలలు

10.1-256-వచనము
ఇట్లు శిశువులు పలికిన పలుకులు విని.
10.1-257-శార్దూల విక్రీడితము
బాలుం డెక్కడ? బండి యెక్కడ? నభోభాగంబుపైఁ జేడ్పడం
గాలం దన్నుట యెక్క? డేల పడుచుల్ ల్లాడి? రీ జడ్డు ప
ల్కే లోకంబున నైనఁ జెప్పఁబడునే? యే చందమో కాక యం
చాలాపించుచుఁ వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యలై రంతటన్.
         ఇలా కృష్ణుని కాలు తాకిడికి బండి ఎగిరిందని చెప్పిన పిల్లల మాటలు విని.
         అప్పుడు గోపికాగోపజనులు ఎంతో ఆశ్చర్యపోతూ ఇలా అనుకోసాగారు ఇంత చంటిపిల్లా డేమిటి? ఇంత పెద్ద బండిని కాలుతో తన్నటం ఏమిటి? అదెళ్ళి ఆకాశం అంత ఎత్తు ఎగరటం ఏమిటి? కుర్రాళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నారో, ఏమిటో కాని. స్వర్గ మర్త్య పాతాళాలనే ముల్లోకాలలో ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి అసంబద్దాలు మాట్లాడారా? లేదు లేదు, దీనికి వేరే హేతువేదో ఉండవచ్చు
         అంతరార్థం గమనించమని చెప్పటాని కేమో, ఇంత గాంభీర్యంగా సందేహాలు వాడటం? అందులో పడుచులు మాటల గురించి. ఇది పోతనగారి చమత్కారమేమో?
          ఇట్లు = ఈ విధముగ; శిశువులు = పిల్లలు; పలికిన = చెప్పుచున్నట్టి; పలుకులు = మాటలు; విని = విని.
          బాలుండు = పిల్లవాడు; ఎక్కడ = ఎక్కడ; బండి = బండి; ఎక్కడ = ఎక్కడ; నభోభాగంబు = ఆకాశము; పైన్ = మీదికి; చేడ్పడన్ = వికలమగునట్లుగా; కాలన్ = కాలితో; తన్నుట = తన్నడము; ఎక్కడన్ = ఎక్కడ; ఏలన్ = ఎందుకని; పడుచుల్ = పిల్లలు; కల్లలు = అబద్ధములు; ఆడిరి = పలికిరి; = ఇలాంటి; జడ్డు = తెలివిమాలిన; పల్కు = మాటలు; = ; లోకంబునన్ = లోకములో; ఐనన్ = అయినప్పటికి; చెప్పబడునే = వినబడుతుందా; = ఎలాంటి; చందమో = హేతువో; కాక = కాని; అంచున్ = అనుచు; ఆలపించుచున్ = మాటలాడుకొనుచు; వ్రేలు = గోపకులు; వ్రేతలు = గోపికలు; ప్రభూత = పుట్టిన; ఆశ్చర్యలు = ఆశ్చర్యములు గలవారు; ఐరి = అయినారు; అంతటన్ = అటుపిమ్మట.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

Thursday, February 26, 2015

కృష్ణలీలలు

10.1-254-వచనము
అని వితర్కించు సమయంబున
10.1-255-కంద పద్యము
బాకుఁ డాకొని యేడ్చుచు
గా లెత్తినఁ దాఁకి యెగసెఁ గాని శకట మే
మూమున నెగయ దని త
ద్బాలుని కడ నాడుచుండి లికిరి శిశువుల్.
         బండి ఎలా ఎగిరి పడిందని గోపగోపికలు యోచించుకుంటున్నారు. అప్పుడు.
         అక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఇలా చెప్పారు. పక్కమీద పడుకున్న చంటిపిల్లాడు హరి ఆకలేసి ఏడుస్తూ కాలు జాడించాడు. కాలు తగిలి బండి ఎగిరిపడింది. అంతే గాని మరో కారణం కాదు.
10.1-254-vachanamu
ani vitarkiMchu samayaMbuna
10.1-255-kaMda padyamu
baalakuM~ Daakoni yEDchuchu
gaa lettinaM~ daaM~ki yegaseM~ gaani shakaTa mE
moolamuna negaya dani ta
dbaaluni kaDa naaDuchuMDi palikiri shishuvul.
          అని = అని; వితర్కించు = యోచించెడి; సమయంబునన్ = సమయమునందు.
          బాలకుడు = పిల్లవాడు; ఆకొని = ఆకలి వేసి; ఏడ్చుచుచున్ = ఏడుస్తూ; కాలున్ = కాలు; ఎత్తినన్ = ఎత్తగా; తాకి = తగిలి; ఎగసెన్ = ఎగిరినది; కాని = తప్పించి; శకటము = బండి; = మరింకేవిధమైన; మూలమునన్ = కారణముచేతను; ఎగయదు = ఎగరలేదు; అని = అని; తత్ = ; బాలుని = పిల్లవాని; కడన్ = వద్ద; ఆడుచుండి = ఆటలాడుకొనుచు; పలికిరి = చెప్పిరి; శిశువులు = చిన్నపిల్లలు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

Wednesday, February 25, 2015

కృష్ణలీలలు

10.1-253-కంద పద్యము
మిన్నున కూరక నెగయదు
న్న సమర్థుండు గాఁడు ల్పగతుం డీ
చిన్నికుమారుఁడు తేరే
విన్ననువున నెగసె దీని విధ మెట్టిదియో.
         ఉత్తినే కారణం లేకుండా బండి ఎగరదు కదా. మరి ఈ చంటి పిల్లాడు కృష్ణుడు అంతటి పనికి చాలినవాడు కాదు. పక్కమీంచి లేవనైన లేవలేడు. మరి బండి ఎలా ఎగిరిపడింది అనుకుంటు గోపగోపికాజనాలు విచారించసాగారు.
10.1-253-kaMda padyamu
minnuna kooraka negayadu
tanna samarthuMDu gaaM~Du talpagatuM Dee
chinnikumaaruM~Du tErE
vinnanuvuna negase deeni vidha meTTidiyO.
              మిన్నునన్ = పైకి; ఊరకన్ = కారణములేకుండగ; ఎగయదు = ఎగరజాలదు; తన్నన్ = తన్నుటకు; సమర్థుండు = శక్తిగలవాడు; కాడు = కాడు; తల్పగతుడు = పక్కమీంచి లేవలేని వాడు; = ; చిన్ని = చంటి; కుమారుడు = పిల్లవాడు; తేరు = బండి; = ; విన్ననువునన్ = విధముగ, యత్నముచే; ఎగసెన్ = ఎగిరినది; దీని = ఇదిజరిగిన; విధము = విధానము; ఎట్టిదియో = ఏమిటో.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :