4-128-క.
"ఘన తేజోనిధి పురుషుం
డనయంబుఁ గృతాపరాధుఁ డయినను దా మ
ల్లన ప్రతికారముఁ గావిం
చిన జనులకు లోకమందు సేమము గలదే?"
4-129-వ.
అని మఱియు నిట్లనియె.
టీకా:
ఘన = గొప్ప; తేజస్ = తేజస్సునకు; నిధి = నిధివంటివాడు; పురుషుండు = పౌరుషవంతుడు; అనయంబున్ = అవశ్యము; కృత = చేసిన; అపరాధుడు = అపరాధముకలవాడు; అయినను = అయినప్పటికిని; తాము = తాము; అల్లన = మెల్లగ; = ప్రతీకారమున్ = ప్రతీకారమును; కావించినన్ = చేసినట్టి; జనుల = జనముల; కున్ = కు; లోకము = ప్రపంచము; అందు = లో; సేమము = క్షేమము; కలదే = ఉన్నదా ఏమి. అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈవిధముగ; అనియె = పలికెను.
భావము:
“మహాతేజస్సంపన్నుడైనవాడు అపరాధం చేసినా తిరిగి అతనికి అపకారం చేసేవారికి ఈ లోకంలో క్షేమం ఉంటుందా?” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=128
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment