4-121-క.
తగవేది దక్షుఁ డా సభ
నగచాపుఁ దిరస్కరించునాఁ డట 'శ్మశ్రుల్
నగచుం జూపుట' నా భృగు
పగకై శ్మశ్రువులు వీరభద్రుఁడు పెఱికెన్.
4-122-సీ.
అతుల దర్పోద్ధతుండై వీరభద్రుండు;
గైకొని దక్షు వక్షంబుఁ ద్రొక్కి
ఘనశితధారాసిఁ గొని మేను వొడచియు;
మంత్రసమన్విత మహిత శస్త్ర
జాలావినిర్భిన్న చర్మంబు గల దక్షుఁ;
జంపఁగా లేక విస్మయము నొంది
తద్వధోపాయంబు దన చిత్తమునఁ జూచి;
కంఠనిష్పీడనగతిఁ దలంచి
4-122.1-తే.
మస్తకముఁ దున్మి యంచితామర్షణమున
దక్షిణాలనమున వేల్చెఁ దదనుచరులు
హర్షమును బొంద; నచటి బ్రాహ్మణజనంబు
లాత్మలను జాల దుఃఖంబు లందుచుండ.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&Padyam=122
తగవేది దక్షుఁ డా సభ
నగచాపుఁ దిరస్కరించునాఁ డట 'శ్మశ్రుల్
నగచుం జూపుట' నా భృగు
పగకై శ్మశ్రువులు వీరభద్రుఁడు పెఱికెన్.
4-122-సీ.
అతుల దర్పోద్ధతుండై వీరభద్రుండు;
గైకొని దక్షు వక్షంబుఁ ద్రొక్కి
ఘనశితధారాసిఁ గొని మేను వొడచియు;
మంత్రసమన్విత మహిత శస్త్ర
జాలావినిర్భిన్న చర్మంబు గల దక్షుఁ;
జంపఁగా లేక విస్మయము నొంది
తద్వధోపాయంబు దన చిత్తమునఁ జూచి;
కంఠనిష్పీడనగతిఁ దలంచి
4-122.1-తే.
మస్తకముఁ దున్మి యంచితామర్షణమున
దక్షిణాలనమున వేల్చెఁ దదనుచరులు
హర్షమును బొంద; నచటి బ్రాహ్మణజనంబు
లాత్మలను జాల దుఃఖంబు లందుచుండ.
టీకా:
తగవు = రీతి; ఏది = తప్పి; దక్షుడు = దక్షుడు; ఆ = ఆ; సభన్ = సభలో; నగచాపున్ = శివుని {నగచాపుడు - మేరుపర్వతమును చాపము (ధనుస్సు)గా పట్టినవాడు, శివుడు}; తిరస్కరించు = దూషించు; నాడు = ఆవేళ; అట = అక్కడ; శ్మశ్రువుల్ = మీసములు; నగుచున్ = నవ్వుతూ; చూపుటన్ = చూపించుటచేత; ఆ = ఆ; భృగు = భృగువుపైని; పగ = పగ; కై = కోసము; శ్మశ్రువులు = మీసములు; వీరభద్రుడు = వీరభద్రుడు; పెఱికెన్ = పీకెను. అతుల = సాటిలేని; దర్ప = దర్పముతో; ఉద్ధతుండు = చెలరేగినవాడు; ఐ = అయ్యి; వీరభద్రుండు = వీరభద్రుడు; కైకొని = చేపట్టి; దక్షు = దక్షుని; వక్షంబున్ = వక్షస్థలమును; త్రొక్కి = తొక్కి; ఘన = గొప్ప; శిత = వాడియైన; ధారా = పదును కలిగిన; అసిన్ = కత్తిని; కొని = తీసుకొని; మేను = చర్మము; ఒలిచియు = ఒలిచినప్పటికిని; మంత్ర = మంత్రశక్తులతో; సమన్విత = కూడినది; మహిత = గొప్ప; శస్త్ర = శస్త్రముల; జాలా = సమూహములముతోనైనా; అవినిర్భిన్న = చినిగిపోనట్టి; చర్మంబున్ = చర్మము; కల = కలిగిన; దక్షున్ = దక్షుని; జంపగాలేక = చంపలేక; విస్మయమున్ = ఆశ్చర్యమును; ఒంది = పొంది; తత్ = అతనిని; వధ = చంపెడి; ఉపాయంబున్ = ఉపాయమును; తన = తనయొక్క; చిత్తమున = మనసులో; చూచి = కనుగొని; కంఠ = గొంతు; నిష్పీడన్ = నులుము; గతిన్ = విధమును; తలంచి = ఆలోచించుకొని. మస్తకమున్ = శిరస్సును; దున్మి = తునిమి; అంచిత = మించుతున్న; అమర్షణమున = రోషముతో; దక్షిణాలమున = దక్షిణాగ్నిలో; వేల్చెన్ = హోమముచేసెను; తత్ = అతని; అనుచరులు = అనుచరులు; హర్షమును = సంతోషమును; పొందన్ = పొందగ; అచటి = అక్కడి; బ్రాహ్మణ = బ్రహ్మణులైన; జనంబులు = జనులు; ఆత్మలనున్ = మనసులలో; చాలన్ = మిక్కిలి; దుఃఖంబులు = దుఃఖములు; అందుచున్ = చెందుతూ; ఉండన్ = ఉండగ.
భావము:
ఆనాడు దక్షుడు అన్యాయంగా శివుని దూషించినప్పుడు నవ్వుతూ మీసాలను చూపించిన భృగువు మీసాలను వీరభద్రుడు పెరికివేశాడు. వీరభద్రుడు సాటిలేని దర్పంతో విజృంభించి దక్షుణ్ణి పడవేసి రొమ్ము త్రొక్కిపట్టి వాడి అంచు కలిగిన కత్తితో ఒడలంతా తూట్లు పొడిచాడు. కాని మంత్రపూతాలయిన అనేక శస్త్రాస్త్రాలతో గట్టిపడిన చర్మం కలిగిన దక్షుణ్ణి చంపలేక ఆశ్చర్యపడి, అతణ్ణి చంపే ఉపాయాన్ని ఆలోచించి మెడ నులిమి, శిరస్సు తునిమి దక్షిణాగ్ని కుండంలో వేసి భస్మం చేశాడు. అది చూచి వీరభద్రుని అనుచరులు సంతోషించగా, అక్కడి బ్రాహ్మణులు మనస్సులో ఎంతో బాధపడ్డారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&Padyam=122
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment