చదువుకుందాం భాగవతం :: బాగుపడదాం మనం అందరం:
10.1-632-క.
కాళియఫణిదూషిత యగు
కాళిందిఁ బవిత్రఁ జేయఁగా నుత్సుకుఁడై
కాళిందీజలవర్ణుఁడు
కాళియు వెడలంగ నడిచెఁ గౌరవముఖ్యా!
టీకా:
కాళియ = కాళియుడు అనెడి; ఫణి = సర్పముచేత; దూషిత
= కలుషితము చేయబడినది; అగు = ఐన; కాళిందిన్
= యమునానదిని; పవిత్రంబు = పరిశుద్ధమైనదిగా; చేయన్
= చేయుటకొరకు; ఉత్సుకుడు = ఉత్సాహము కలవాడు; ఐ =
అయ్యి; కాళిందీజలవర్ణుండు = కృష్ణుడు {కాళిందీజలవర్ణుడు
- కాళిందీ (యమునా నది) యొక్క జల (నీటి) వలె నల్లని వర్ణుడు (రంగు దేహము కలవాడు),
కృష్ణుడు}; కాళియున్ = కాళింగుని; వెడలంగనడిచెన్
= వెడలగొట్టెను; కౌరవముఖ్య = పరీక్షిన్మహారాజా {కౌరవముఖ్యుడు
- కురువంశపు రాజులలో ముఖ్యమైన వాడు, పరీక్షిత్తు}.
భావము:
కురువంశంలో ముఖ్యమైన మహారాజా! పరీక్షిత్తూ! కాళియుడు అనే నాగుడి వల్ల
పాడైన కాళింది మడుగును బాగు చేయాలని శ్రీకృష్ణుడు సంకల్పించుకొన్నాడు. కాళిందినదీ
జలాల వలె నీల వర్ణ దేహుడైన కృష్ణుడు కాళియ సర్పాన్ని వెళ్ళగొట్టాడు.”
గంగానది నీళ్ళు తెల్లగా ఉంటాయి. యమునానది నీళ్ళు నల్లగా ఉంటాయి. ప్రయాగ త్రివేణీసంగమం వద్ద ఆ తేడా బాగా తెలుస్తుంది.
గంగానది నీళ్ళు తెల్లగా ఉంటాయి. యమునానది నీళ్ళు నల్లగా ఉంటాయి. ప్రయాగ త్రివేణీసంగమం వద్ద ఆ తేడా బాగా తెలుస్తుంది.
No comments:
Post a Comment