( గర్భ సంభవ ప్రకారంబు )
3-1010-క.
హరిమాయా విరచితమై
తరుణీరూపంబుఁ దాల్చి ధరఁ బర్విన బం
ధుర తృణపరివృత కూపము
కరణి నదియు మృత్యురూపకం బగు మఱియున్.
3-1011-చ.
ధన పశు మిత్ర పుత్ర వనితా గృహకారణభూత మైన యీ
తనువున నున్న జీవుఁడు పదంపడి యట్టి శరీర మెత్తి తా
ననుగతమైన కర్మఫల మందకపోవఁగరాదు మింటఁ బో
యిన భువిఁ దూరినన్ దిశల కేగిన నెచ్చట నైన డాగిఁనన్.
భావము:
నా మాయచేత కల్పించబడిన కామినీరూపం దట్టమైన గడ్డిచే కప్పబడిన కూపానికి అనురూపమై, మృత్యుస్వరూపమై ఉంటుంది. ఇంకా ధన్యధాన్యాలు, పశువులు, పుత్రులు, మిత్రులు, స్త్రీలు, గృహాలు మొదలైన వాటికి కారణభూతమైన ఈ శరీరంలో ఉన్న జీవుడు ఇవన్నీ అనుభవించి మళ్ళీ ఈ జన్మలోని కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఇటువంటి శరీరాన్ని మళ్ళీ ధరిస్తాడు. ఆకాశంలోకి ఎగిరిపోయినా, భూమిలో దూరినా, దిక్కులకు పారిపోయినా, ఎక్కడ దాగినా కర్మఫలాన్ని అనుభవింపక తప్పదు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=1011
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment