( గర్భ సంభవ ప్రకారంబు )
3-1001-సీ.
"నెలకొని బహు దుఃఖములకు నాలయ మైన;
యీ గర్భనరకము నేను వెడలఁ
జాల బహిఃప్రదేశమునకు వచ్చిన;
ననుపమ దేవమాయా విమోహి
తాత్ముండనై ఘోరమైనట్టి సంసార;
చక్ర మందును బరిశ్రమణశీలి
నై యుండవలయుఁ దా నదిగాక గర్భంబు;
నందుండు శోకంబు నపనయించి
3-1001.1-తే.
యాత్మ కనయంబు సారథి యైన యట్టి
రుచిర విజ్ఞానమునఁ దమోరూపమైన
భూరి సంసారసాగరోత్తారణంబు
సేసి యీ యాత్మ నరసి రక్షించుకొందు.
భావము:
‘ఎన్నెన్నో దుఃఖాలకు నిలయమైన ఈ గర్భనరకం నుండి నేను బయట పడలేను. ఒకవేళ బయటకు వచ్చినా దేవమాయలకు లోనై వ్యామోహంతో భయంకరమైన సంసార వలయంలో చిక్కుకొని పరిభ్రమిస్తూ ఉండవలసిందే. అందుకని ఈ గర్భశోకాన్ని పోగొట్టేదీ, ఆత్మను సారథియై నడిపించేదీ అయిన విజ్ఞానాన్ని ఆశ్రయించి అంధకార బంధురమైన సంసార సాగరాన్ని దాటి ఆత్మను రక్షించుకుంటాను.
http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=1001
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment