::చదువుకుందాం భాగవతం ::
బాగుపడదాం మనం అందరం::
శుభవార్త
2016 తెలుగు ప్రపంచ సాహితీ సమావేశాలు సింగపూరులో నవంబరు
5, 6 వ తారీఖులలో జరుగుతున్నాయి. . .
1. తెలుగుభాగవతం.ఆర్గ్
మరియూ తెలుగు భాగవత ప్రచార సమితి, వాటిలో భాగంగా 5వ తారీఖు సింగపూరు కాలమానం
ప్రకారం మధ్యాహ్నం మన తెలుగుభాగవతం నేపధ్యంలో భాగవత విశిష్టతను గురించి ప్రసంగం /
పరిచయం చేయిస్తోంది. మన భాగవత బంధువు భాస్కర కిరణ్
ఈ ప్రసంగం చేయబోతున్నాడు.
2. ఇదే సందర్భంలో భాస్కర కిరణ్ అద్వర్యంలో సింగపూరులో మన భాగవత
బంధువు ఫణికిరణ్ ప్రచురణ మన తెలుగు భాగవతం చరణిగ్రంథం (మొబైల్ బుక్) ఆవిష్కరణ కూడా
చేస్తున్నాము.
3. అదే రోజు అనగా 2016,
నవంబరు – 05 సాయంకాలం 5.00 గంటలకు, 1వ సెక్టారు, హెచ్ఎస్ఆర్ లే అవుటు, వినాయ
దేవాలయ ప్రాంగణం, బెంగళూరులో పై తెలుగు భాగవతం చరణిగ్రంథం (మొబైల్ బుక్) ఆవిష్కరణ
కూడా చేస్తున్నాము. ప్రచురణ కర్త భాగవత బంధువు ఫణికిరణ్.
ఈ కార్యక్రమాలు సుసంపన్నంగా, జయప్రదంగా జరిగేలా మానల్లనయ్య
అనుగ్రహించు గాక. తద్వారా తెలుగుల పుణ్యకోటి పోతన పోతపోసిన ఈ మహా గ్రంథం మన
తెలుగులకు మరింత చేరువై మరింత బాగుపడేలా అనుగ్రహించు గాక . . .
మాన్యులారా పేరు పేరునా మిమ్మల్ని అందరిని ఈ కార్యక్రమాలకు
హాజరై కార్యకర్తలను ఆశీర్వదించి సభలను సుసంపన్నం చేయించవలసినదిగా కోరుచున్నాను.
::చదువుకుందాం భాగవతం ::
బాగుపడదాం మనం అందరం::
No comments:
Post a Comment