Thursday, February 13, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 201

జనకసుతా

9-734-క.
కసుతాహృచ్చోరా!
కవచోలబ్దవిపిన శైలవిహారా!
కామితమందారా!
నాదికనిత్యదుఃఖయసంహారా!
          జనకమహారాజు పుత్రిక సీతాదేవి మనసు దోచుకున్న ఆదర్శ భర్తవు. తండ్రి మాట నిలబెట్టడం కోసం కొండకోనలలో తిరిగి కష్టాలు అనుభవించిన ఆదర్శ పుత్రుడవు. ప్రజల కోరికలను తీర్చుటలో కల్పవృక్షము వంటి ఉత్తమ పాలకుడవు. పునర్జన్మ మున్నగు విడువరానిదుఃఖా లన్నిటిని తొలగించేవాడవు. అయినట్టి శ్రీరామచంద్రప్రభు! నీకిదే వందనం.
పాదంలో రెండవ అక్షర నియమం ప్రాస కదా, 45 అక్షరాలున్న కందపద్యం నాలుగు పాదాలలోను ప్రాసాక్షర, ముందరి అక్షరాలకి (8 అక్షరాలు) అచ్చు హల్లుల అభేదం పాటించబడింది ఈ ద్వాదశ స్కంధాంత ప్రార్థన పద్యానికి.
9-734-ka.
janakasutaahRchchOraa!
janakavachOlabdavipina Sailavihaaraa!
janakaamitamaMdaaraa!
jananaadikanityadu@hkhachayasaMhaaraa!
జనకసుతాహృచ్చోరా = శ్రీరామా {జనకసుతా హృచ్చోరుడు - జనకునిపుత్రిక సీత హృదయము దోచుకొన్నవాడు, రాముడు}; జనక వచోలబ్ద విపిన శైల విహారా = శ్రీరామా {జనక వచోలబ్ద విపిన శైల విహారుడు - తండ్రి మాట జవదాటక కొండకోనలలో తిరిగినవాడు, రాముడు}; జన కామిత మందారా = శ్రీరామా {జన కామిత మందారుడు - ప్రజల కోరికలు తీర్చుటలో కల్పవృక్షము వంటివాడు, రాముడు}; జననాదికనిత్యదుఃఖచయసంహారుడు = శ్రీరామా {జననాదికనిత్యదుఃఖచయసంహారా - పునర్జన్మ మున్నగు విడువరానిదుఃఖా లన్నిటిని తొలగించేవాడ}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: